రక్తహీనతను తగ్గించే అంజీర్‌!

25 Nov, 2017 01:39 IST|Sakshi

శుష్కఫలాల్లో (డ్రైఫ్రూట్స్‌లో) అంజీర్‌ది ప్రత్యేకమైన స్థానం. ఎంతో రుచిగా ఉండే వీటితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో కొన్ని.
వీటిల్లో ఐరన్‌ చాలా ఎక్కువ. అందుకే రక్తహీనతతో బాధపడేవారికి డాక్టర్లు అంజీర్‌ను సిఫార్సు చేస్తుంటారు
ఫైబర్‌ ఎక్కువగా ఉండటంతో పాటు కొవ్వులు చాలా చాలా తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునేవారు అంజీర్‌ తినడం మంచిది.    
అంజీర్‌లో పొటాషియమ్‌ ఎక్కువ. సోడియమ్‌ చాలా తక్కువ. అందువల్ల ఇది రక్తపోటును సమర్థంగా నివారిస్తుంది.
అంజీర్‌లో క్యాల్షియమ్‌ పుష్కలంగా ఉండటం వల్ల ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అవి బలంగా ఉండేలా చూస్తుంది.
అంజీర్‌లో మంచి పోషకాలు ఉండటం వల్ల ఇవి రోగనిరోధక శక్తిని కూడా పెంపొందిస్తాయి.

మరిన్ని వార్తలు