ఆపలేరు.. ఆర్పలేరు!

26 Jan, 2017 06:43 IST|Sakshi
ఆపలేరు.. ఆర్పలేరు!

కొవ్వొత్తులు ఆర్పడానికి ఇన్ని కుట్రలా!
హక్కులను కాలరాసేవి... ప్రభుత్వాలా!
ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంటే...
ప్యాకేజీల కోసం ఎందుకీ వెంపర్లాట?
మౌనదీక్షను ఆపడానికిఅన్ని కుతంత్రాలు, ఇన్ని కూతలా?
హోదా వల్ల పరిశ్రమలు వస్తే వీళ్లకేంటి నష్టం?
యువతకు ఉద్యోగాలు వస్తే వీళ్లకెందుకంత కష్టం!
పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీని తుంగలో తొక్కేశారా?
వెంకన్న సాక్షిగా ఇచ్చిన మాటను కొండెక్కించారా!
మీరు అడగరు. అడిగేవాళ్లను అడ్డుకుంటారా!!
ప్రజల ఆకాంక్షల్ని తాకట్టుపెట్టడానికిఈ రాష్ట్రం ఎవరి బాబు సొత్తు?
మీ పిల్లలు పచ్చగా ఉంటే చాలా?
యువతకు భవిత వద్దా?
ఆంధ్రాను అంధకారంలో ముంచేస్తారా?
కాసుల కోసం కేసులు పెడతారా?
పిడికిలి బిగిస్తే పీడీ యాక్టులని బెదిరిస్తారా?
ఒక్క కొవ్వొత్తిని ఆర్పుదామనుకుంటే అది కోటి కాగడాలై ఉద్యమిస్తుంది.
ఒక పిడికిలిని వంచేద్దామని చూస్తే కోటి శిరస్సులు ధిక్కరిస్తాయి.
ఒక గొంతును నొక్కుదామని చూస్తే కోటి  కెరటాలు హోరెత్తుతాయి.
కొవ్వెక్కిన అధికారం నియంతలా ఆంక్షలు పెడుతుంటే...
కొవ్వొత్తుల్లా.. కరిగైనా ఉద్యమిస్తానంటోంది యువత.


కోటి ఆకాంక్షల తీరం ఇది. సాధించుకునే యువతరం ఇది. అందుకు ఈ గణతంత్ర దినమే సాక్షి.
నేడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ యువత కొవ్వొత్తులతో చేయతలపెట్టిన శాంతియుత మౌన దీక్షను భగ్నం చేయాలనుకుంటున్న కుయుక్తులకు ప్రతీకాత్మక చిత్రం.

నేనూ వస్తున్నా... నేటి మౌనదీక్షకు ఏపీ ప్రతిపక్ష నేత వై.ఎస్‌. జగన్‌ హాజరవుతున్నారు

 

మరిన్ని వార్తలు