మాస్టర్‌ స్విచ్‌ను  కనుక్కున్నారా?

15 Feb, 2019 00:20 IST|Sakshi

గుండెజబ్బులు మాత్రమే కాకుండా మధుమేహం, కిడ్నీ, ఊపిరితిత్తుల వ్యాధులన్నింటికీ మరింత సమర్థమైన చికిత్స అందించేందుకు జాన్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ వినూత్న ఆవిష్కరణ చేశారు. పోషకాలు, కాలుష్యాలు.. పర్యావరణం తదితరాల నుంచి వచ్చే సంకేతాలకు అనుగుణంగా రోగ నిరోధక వ్యవస్థలోని కణాలను చైతన్యవంతం చేసే ఒక ప్రొటీన్‌ను నియంత్రించడం ద్వారా గుండెజబ్బులను నియంత్రించవచ్చునని వీరు అంటున్నారు.

ఎంటార్‌సీ1 అనే ఈ ప్రొటీన్‌ను నైట్రోగ్లిసరిన్, సిల్దనాఫిల్‌ వంటి రసాయనాలతో అవసరమైనప్పుడు మాత్రమే పనిచేసేలా చేయవచ్చునని తాము ఎలుకలపై జరిపిన పరిశోధనల ద్వారా గుర్తించామని డేవిడ్‌ కాస్‌ అనే శాస్త్రవేత్త తెలిపారు. టర్బటిన్‌ అనే రసాయనం జీవక్రియలను.. కణాల పెరుగుదల, విభజన వంటి అంశాలన్నింటినీ నియంత్రిస్తున్నట్లు తమకు తెలిసిందని చెప్పారు. నైట్రోగ్లిసరిన్, సిల్దనాఫిల్‌ వంటి వాటి మందులతో ఈ టర్బటిన్‌ను ప్రేరేపితం చేయవచ్చునని వీరు అంటున్నారు. మరిన్ని పరిశోధనలు చేయడం ద్వారా ఎంటార్‌సీ1 ఉత్పత్తిని నియంత్రిస్తూ గుండెజబ్బులను అదుపులో ఉంచవచ్చునని చెప్పారు.  

మరిన్ని వార్తలు