నేను ఎవరి బిడ్డను?

21 Aug, 2019 07:23 IST|Sakshi
‘ఫైడింగ్‌ ఫరీదా’ మూవీ స్టిల్‌

అంతర్జాతీయ చలన చిత్రం కేటగిరీ కింద ఇరాన్‌ డాక్యుమెంటరీ ‘ఫైండింగ్‌ ఫరీదా’ 2020 ఆస్కార్‌ అవార్డుల పోటీకి నామినేట్‌ అయింది. ఇరాన్‌ ప్రభుత్వం ఒక డాక్యుమెంటరీని ఆస్కార్‌ నామినేషన్‌కు ఎంపిక చెయ్యడం ఇదే మొదటిసారి. ఇదే కేటగిరీ కింద గతంలో ఇరాన్‌ ‘ఎ సపరేషన్‌’ (2012), ‘ది సేల్స్‌మాన్‌’ (2017) చిత్రాలకు ఆస్కార్‌ను గెలుపొందింది. ఫరీదా అనే ఇరానీ అమ్మాయిని నలభై ఏళ్ల క్రితం డచ్‌ (నెదర్లాండ్స్‌) దంపతులు దత్తత తీసుకెళతారు. ఆ అమ్మాయి పెరిగి పెద్దయ్యాక తొలిసారి తన మాతృభూమిని, కన్నవాళ్లను చూసేందుకు వెళుతుంది. అక్కడ మూడు కుటుంబాలు ఫరీదా ‘మా అమ్మాయే’ అని ముందుకు వస్తాయి. వారిలో నిజంగా తను ఎవరింటి బిడ్డో తెలుసుకోడానికి ఫరీదా అక్కడ మళ్లీ తనను తను వెతుక్కుంటుంది. ఇదే ‘ఫైండింగ్‌ ఫరీదా’ స్టోరీ.

>
మరిన్ని వార్తలు