పీచుతో కడుపు సమస్యకు పరిష్కారం...

11 Sep, 2018 05:08 IST|Sakshi

వయసు పెరిగిన కొద్దీ జీర్ణ సంబంధిత సమస్యలు పెరగడం సహజం. మన పేగుల లోపలి పొరలు బలహీనపడటం దీనికి కారణం. ఇంటస్టైనల్‌ బ్యారియర్‌ అని పిలిచే ఈ పొరలను గట్టిపరచుకోవడం సులువేనని రెబ్రో యూనిర్శిటీశాస్త్రవేత్తలు జాన్‌ పీటర్, గండామాల్స్‌ అంటున్నారు. పీచు పదార్థం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం ద్వారా బ్యాక్టీరియా, హానికారక పదార్థాల నుంచి రక్షణ కల్పించే పేగు పొరను గట్టిగా చేసుకోవచ్చునని చెప్పారు. 65 కంటే ఎక్కువ వయసున్న వారి పేగు పొరల నమూనాలను పరిశీలించడం ద్వారా తాము ఈ అంచనాకు వచ్చినట్లు చెప్పారు.

ఆరోగ్యకరమైన వారి పేగు పొరలతో పోల్చినప్పుడు పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకునే వారి పొరలు దృఢంగా ఉన్నట్లు తెలిసిందన్నారు. ఈస్ట్‌ ఫంగస్‌ నుంచి లభించే పీచు పదార్థం ఒకటి వయసు మీరిన వారి పేగులపై మంచి ప్రభావం చూపుతున్నట్లు తమ పరిశీలనలో వెల్లడైంది అన్నారు. కొంతమంది వృద్ధులకు రెండు రకాల పీచు పదార్థాలను ఆరు వారాల పాటు అందించి పరిశీలించినప్పడు మాత్రం పెద్ద తేడా లేకుండా పోయిందని అన్నారు. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వేడినీటి స్నానంతోనూ వ్యాయామ లాభాలు...

మందుల కారణంగా  మధుమేహ సమస్యలు తీవ్రం!

సిలికోసిస అంటే ఏమిటి? 

బల బాంధవి

అనార్వచనీయం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రేమ.. వినోదం

ఓ ప్రేమకథ

న్యూస్‌ను సృష్టిస్తే?

ఐదేళ్లకు ఏడడుగులు

స్క్రీన్‌ టెస్ట్‌

ప్రాణం ఖరీదు ఎంత?