ఫుడ్ కలర్‌గానూ బీట్‌రూట్

19 Oct, 2015 00:03 IST|Sakshi
ఫుడ్ కలర్‌గానూ బీట్‌రూట్

తిండి  గోల
యూరప్‌లో ఆహార కొరత ఏర్పడినప్పుడు, వ్యాధులు ప్రబలినప్పుడు అక్కడి ప్రజలు బతకడానికి దుంపజాతికి చెందినవాటినే ప్రధానంగా బీట్‌రూట్‌నే జీవనాధారంగా చేసుకున్నారనే వార్తలు ఉన్నాయి. దుంప జాతికి చెందిన బీట్‌రూట్ స్వస్థలం నార్త్ అమెరికా. మన దగ్గర బంగాళదుంప, చిలగడ దుంప, ముల్లంగి.. వంటి దుంప రకాలు ఉన్నాయి. వాటి జాబితాలోనిదే బీట్‌రూట్ కూడా! ఇంగ్లిషు రాని వారితో కూడా ఇంగ్లిషులోనే పిలిపించుకునే కూరగాయ ఇదొక్కటే అయి ఉంటుంది. బ్రిటీష్ వారితో పాటు ఇది మన దేశంలో అడుగుపెట్టింది.

బీట్‌రూట్‌లో రక్తాన్ని వృద్ధి చేసే గుణాలు, యాంటీయాక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. పచ్చిగానే ముక్కలు చేసుకొని, భోజనంలో సైడ్ డిష్‌గా తినడానికి కారణం అదే! డచ్ దేశ స్థుల సంప్రదాయ వంట బీట్‌రూట్, ఉడికించిన కోడిగుడ్డుతో కలిపి నిల్వపచ్చడి పెట్టడం  పోలండ్, ఉక్రెయిన్‌లో సూప్‌లు, శాండ్‌విచ్‌లలో బీట్‌రూట్‌ను విరివిగా ఉపయోగిస్తారు. రష్యా వంటకాలలోనూ సైడ్ డిష్‌గా బీట్‌రూట్ ఉండాల్సిందే! నీటి శాతం తక్కువగా ఉండే ఈ దుంపతో జ్యూస్‌లు బాగా చేస్తారు. వైన్ తయారీలో బీట్‌రూట్ ఉంటుంది. టొమాటో పేస్ట్, సాస్, డిజెర్ట్, జామ్స్, జెల్లీ, ఐస్‌క్రీమ్, స్వీట్లు...లలో బీట్‌రూట్‌ను కలర్‌గా ఉపయోగిస్తారు.

మరిన్ని వార్తలు