కుశల వర్ణాలు

7 Nov, 2019 03:17 IST|Sakshi

హెల్దీ కలర్స్‌

కలర్‌ డైట్‌ చార్ట్‌

ఆహారాలు రంగులు ప్రయోజనాలు

ఎన్నెన్నో వర్ణాలతో కూడిన మన ప్రపంచం చాలా అందమైనది. ఈ లోకం అందాలను భావుకతతో ఆస్వాదించడానికీ మన ఆరోగ్యమూ బాగుండాలి. అందుకోసమేనేమో... ఆరోగ్యం బాగుండటాన్ని ఇంగ్లిష్‌లో అందంగా ‘ఇన్‌ ద పింక్‌ ఆఫ్‌ .... హెల్త్‌’ అంటూ చెబుతుంటారు. మన ఆరోగ్యాన్ని వర్ణమయం చేసుకోడానికి ఏయే రంగుల ఆహారాలు ఉపకరిస్తాయో చూద్దాం.

క్యాన్సర్‌నివారణకు
నారింజ రంగు
ఈ రంగు ఆహారపదార్థాలు గుండెకు మేలు చేస్తాయి. తమలోని విటమిన్‌–సి తో వ్యాధి నిరోధకతను పెంచుతాయి. యాంటీ ఆక్సిడెంట్లతో క్యాన్సర్లనుంచి రక్షణతో పాటు చాలాకాలం పాటు యౌవనంగా ఉండేలా చేస్తాయి.

అందం మెరుగుదల
పసుపుపచ్చ
గుండెకు మేలు చేస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌ను అదుపు చేస్తాయి. మన మేనిలో మంచి నిగారింపు వచ్చేలా చూస్తాయి. కంటిచూపును కాపాడతాయి.

వ్యాధి నిరోధకత
తెలుపు
తెల్లరంగులో ఉండే ఆహారాలు మనలో రోగనిరోధకత బలంగా ఉండేలా చూస్తాయి. పెద్ద పేగును ఆరోగ్యంగా ఉంచుతాయి. అల్సర్స్‌ను నివారిస్తాయి. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.

చాలాకాలం యౌవనంగా...
పర్పుల్‌
గుండెకు ఎంతో మంచివి. రక్తనాళాలను శుభ్రం చేసి, వాటిల్లో రక్తప్రవాహం సాఫీగా జరిగేలా చూస్తాయి. వయసు పెరిగే ప్రక్రియను మందగింపజేస్తాయి. మూత్రవిసర్జన వ్యవస్థను ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి.

విషాలను తొలగించడానికి
ఆకుపచ్చ
ఆకుపచ్చగా ఉండే ఆహారాలు ఎముకలను బలంగా ఉంచుతాయి. చూపును పదికాలాలపాటు పదిలంగా ఉంచుతాయి, కంటి వ్యాధులను నివారిస్తాయి.  వ్యాధి నిరోధకతను పెంచుతాయి. తమలోని పీచుతో జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడతాయి.

గుండె ఆరోగ్యానికి
ఎరుపు
గుండెకు ఎంతో మేలు చేస్తాయి. రక్తపోటును తగ్గిస్తాయి. మన చర్మానికి ఎంతో మంచివి. క్యాన్సర్లను నివారిస్తాయి. కణాజాల ఆరోగ్యానికి ఎంతో తోడ్పడతాయి.

సుజాతా స్టీఫెన్‌ చీఫ్‌ న్యూట్రిషనిస్ట్‌ యశోద హాస్పిటల్స్,
మలక్‌పేట, హైదరాబాద్‌

మరిన్ని వార్తలు