అదిగదిగో లక్ష్యం!

18 Jun, 2014 23:33 IST|Sakshi
అదిగదిగో లక్ష్యం!

విజన్
 
క్రికెట్  తప్ప ఏ ఆటా పట్టని మన దేశ యువతలో ఇప్పుడు మార్పు వస్తోంది. ఫుట్‌బాల్ వరల్డ్ కప్ ఫీవర్ వారిని కూడా బలంగానే తాకింది. ఫుట్‌బాల్‌లో తమ అభిమాన తారలను కూడా ఎంచుకుంటున్నారు. కొందరు ఆ అభిమానాన్ని టీ షర్ట్‌ల రూపంలో ప్రదర్శిస్తున్నారు. ఆసక్తి , అభిమానం సంగతి పక్కన పెడితే ‘ఫుట్‌బాల్ లో మన సత్తా చాటలేమా?’ అనే ప్రశ్నకు ‘ఖచ్చితంగా చాటవచ్చు’ అని సమాధానమిస్తున్నారు క్రీడా నిపుణులు.
 
 2017లో ఫిఫా అండర్-17 వరల్డ్‌కప్‌కు ఆతిథ్యం  ఇచ్చే అపూర్వమైన అవకాశం మన దేశానికి వస్తుంది. ఫుట్‌బాల్‌కు సంబంధించి మన దేశంలో ఇదొక పెద్ద కార్యక్రమం. ఆ సమయానికల్లా మన వాళ్లు ఫుట్‌బాల్ ఆటలో  సత్తా చాటడానికి నిపుణులు చెబుతున్న కొన్ని సూచనలు:
     
 దేశవ్యాప్తంగా పద్నాలుగు సంవత్సరాలలోపు  ఉన్న పిల్లలలోని క్రీడా నైపుణ్యాన్ని గుర్తించాలి. దాన్ని మరింత మెరుగైన స్థితికి తీసుకువెళ్లాలి.
     
 ఫుట్‌బాల్ ఆటకు సంబంధించిన మౌలిక వసతులను పాఠశాల, కళాశాల స్థాయిలో కల్పించాలి.
     
 యూత్ లీగ్‌లు, టోర్నమెంట్‌లు దేశవ్యాప్తంగా నిర్వహించడం ద్వారా మెరికల్లాంటి  ఆటగాళ్లను గుర్తించాలి.
     
 ప్రపంచస్థాయి ఆటగాళ్లను  తీర్చిదిద్దడానికి అవసరమైన అధునాతమైన వసతులతో దేశంలో ఫుట్‌బాల్ అకాడమీలను ఏర్పాటు చేయాలి.
     
 పాఠశాల యజమాన్యాలు ఫుట్‌బాల్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆ ఆటకు సంబంధించి గొప్ప ఆటగాళ్ల విజయగాథలను స్ఫూర్తిదాయకంగా చెప్పాలి. మెరికల్లాంటి  ‘యువ ఫుట్‌బాల్’ ఆటగాళ్లు తయారుకావడానికి పాఠాశాలలు, మీడియా తమ వంతు పాత్రను పోషించాలి.
     
 యూరోపియన్ క్లబ్‌ల మాదిరిగా  కార్పొరెట్ కంపెనీల సహకారంతో యువత కోసం ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లను నిర్వహించాలి.
 

>
మరిన్ని వార్తలు