మతిమరుపు దూరం

11 Jun, 2017 23:09 IST|Sakshi
మతిమరుపు దూరం

గుడ్‌ఫుడ్‌

పాలకూర ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువ అంటే అతిశయోక్తి కానే కాదు. పాలకూరతో సమకూరే ఉపయోగాలలో ఇవి కొన్ని...ఐరన్‌ చాలా ఎక్కువగా ఉండే ఆకుకూరల్లో పాలకూర కూడా ఒకటి. ఇందులో దాదాపు 25 శాతం ఐరన్‌ ఉంటుంది. అందుకే రక్తహీనత ఉన్నవారికి డాక్టర్లు పాలకూరను సిఫార్సు చేస్తుంటారు.పాలకూరలో విటమిన్‌–ఏ తోపాటు విటమిన్‌–సి కూడా చాలా ఎక్కువ. అందుకే దీనితో మంచి వ్యాధి నిరోధక శక్తి సమకూరుతుంది.ఇందులో ఉంటే ల్యూటిన్, జియాగ్జాంథిన్‌ వంటి శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్స్‌ ఫ్రీరాడికల్స్‌ను అరికట్టి, క్యాన్సర్‌ నుంచి రక్షిస్తాయి.

పాలకూరలో విటమిన్‌–కె పాళ్లు కూడా ఎక్కువ. రక్తం గడ్డకట్టేందుకు తోడ్పడటంతోపాటు ఎముక సాంద్రత పెంచుతుంది. మెదడులోని న్యూరాన్లకు రక్షణ కల్పిస్తూ... వయసు పెరిగాక వచ్చే అలై్జమర్స్‌ వ్యాధిని నివారిస్తుంది.పాలకూరలో విటమిన్‌–బి కాంప్లెక్స్‌లోని అన్ని పోషకాలూ ఉన్నాయి. పుట్టుకతో వచ్చే అనేక జబ్బులను ఈ పోషకాలు నివారిస్తాయి. అందుకే డాక్టర్లు పాలకూర ఎక్కువగా తినమంటూ గర్భిణులకు సిఫార్సు చేస్తారు.

>
మరిన్ని వార్తలు