ఒత్తిడితో మతిమరుపు

2 Mar, 2016 23:19 IST|Sakshi
ఒత్తిడితో మతిమరుపు

పరిపరి  శోధన

మానసిక ఒత్తిడి దీర్ఘకాలం కొనసాగితే మతిమరుపు తప్పదని వైద్య పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఎప్పుడో ఒకసారి అరుదుగా ఎదురయ్యే మానసిక ఆందోళన, ఒత్తిడి వల్ల పెద్దగా అనర్థాలేమీ ఉండకపోయినా, దీర్ఘకాలికంగా అదే పరిస్థితి కొనసాగుతుంటే మెదడులోని ‘హిప్పోక్యాంపస్’ భాగంలో మార్పులు తలెత్తి, జ్ఞాపకశక్తి క్రమంగా క్షీణిస్తుందని ఓహయో స్టేట్ వర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు.

ఎలుకలపై నిర్వహించిన పరిశోధనల్లో తాము ఈ విషయాన్ని గుర్తించామని అంటున్నారు. దీర్ఘకాలం పాటు కొన్ని ఎలుకలను ఒత్తిడికి గురిచేసి, వాటి మెదడు పనితీరులో వచ్చిన మార్పులను అధ్యయనం చేసిన ఈ పరిశోధకులు తమ పరిశోధన వివరాలను ‘జర్నల్ ఆఫ్ న్యూరోసైన్స్’లో ప్రచురించారు.
 

 
 

మరిన్ని వార్తలు