భగవంతుని విరాట్రూపమే పద్నాలుగు లోకాలు

5 Mar, 2016 23:25 IST|Sakshi
భగవంతుని విరాట్రూపమే పద్నాలుగు లోకాలు

మామిడిపూడి ‘గీత’
పంచభూతాలతో ఏర్పడినది జగత్తు.

 1. భూమి 2. ఉదకం. 3. అగ్ని 4. వాయువు 5. ఆకాశం. ఇవి పంచభూతాలు.
భూమిపై మానవులను, జంతువులను, ఇతర చరాచరాలను చూస్తున్నాము. నీటిలో చరాచరాలు ఉన్నాయి. అగ్ని, వాయువు తమ తమ ప్రవృత్తులతో ఇంద్రియ గోచరాలవుతున్నాయి. ఆకాశాన సూర్యచంద్రులు, ఇతర గ్రహాలు, నక్షత్రాలు, తేజోగోళాలు కనిపిస్తున్నాయి. ఖగోళ శాస్త్రజ్ఞుల పరిశోధనలు జరిపి నూతనంగా కనిపెట్టిన గోళాలను గురించి మనకు అనేక విషయాలు తెలియజేస్తున్నారు. ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి.

 వెలుగు ఒక సెకండుకు రమారమి 1,86,000 మైళ్లకు మించిప్రయాణం చేస్తుంది. భూమండలానికి ఎంతో దూరాన ఉన్న నక్షత్రాలనుండి ఏనాడో బయల్దేరిన కాంతికిరణాలు భూమిని చేరడానికి ఇంకా కొన్ని వేలసంవత్సరాలు పడుతుందట. విశ్వం అనంతమని, దాని ఆయతనం ఊహించరానిదనీ నిరూపించటానికి ఇంతకన్నా మనకేం కావాలి? మన శాస్త్ర సంప్రదాయాలను అనుసరించి ఈ జగత్తులో పద్నాలుగు లోకాలు ఇమిడి ఉన్నాయి. భగవంతుని విరాట్‌రూపంలోనివే ఇవన్నీ.

1.అతలం (పాదాలు) 2. వితలం (మడమలు) 3. సుతలం (జంఘాలు) 4.రసాతలం (జానువులు) 5. మహాతలం (ఊరువులు) 6. తలాతలం (కటి) 7.పాతాళం (నాభి పైభాగం) 8.భూలోకం (నాభి) 9. భువర్లోకం (జఠరం) 10.స్వర్లోకం (వక్షం) 11.మహర్లోకం (కంఠం) 12. జనోలోకం (ముఖం) 13.తపోలోకం (భ్రూమధ్యం) 14. సత్యలోకం (శిరస్సు) వచ్చేవారం శ్రీకృష్ణుని విశ్వరూప సందర్శన వర్ణనం) కూర్పు: బాలు- శ్రీని

 

>
మరిన్ని వార్తలు