అనుకోని ఆతిథ్యం

20 Apr, 2020 10:22 IST|Sakshi

తిరిగే కాలిని తిరగనియ్యకుండా చేసింది కరోనా వచ్చి! ఫ్రాన్స్‌లోని తులూస్‌ నగరంలో ఉంటాడు పొల్లారెజ్‌ ప్యాట్రీస్‌ (40). మోటార్‌ మెకానిక్‌ ఆయన. భార్య విర్జినీ, కూతుళ్లు ఒఫేలీ, లోలా, కొడుకు టామ్‌.. ఇదీ అతడి ఫ్యామిలీ. అయితే ప్రస్తుతం వాళ్లు ఫ్రాన్స్‌లో లేరు. యు.పి. మహారాజ్‌గంజ్‌లోని లక్ష్మీపురంలో ఉన్నారు! సొంత వెహికల్‌లో ప్రపంచ పర్యటనకు బయల్దేరిన ఈ కుటుంబం.. టూర్‌ పూర్తి కాకుండానే ఇండియాలో ఉండిపోవలసి వచ్చింది.

లాక్‌డౌన్‌లో చిక్కుకుపోయిన ఈ కుటుంబాన్ని లక్ష్మీపురం గ్రామస్తులు మూడువారాలుగా ఆదరిస్తున్నారు. ఆత్మీయ ఆతిథ్యం ఇస్తున్నారు. కావలసినవన్నీ సమకూరుస్తున్నారు. గత డిసెంబర్‌లో వీరి యాత్ర మొదలైంది. ఫిబ్రవరిలో పాకిస్తాన్‌ నుంచి వాఘా బోర్డర్‌ గుండా ఇండియాకు వచ్చారు. ఇక్కడ కొన్ని నగరాలు పర్యటించి, నేపాల్‌ వెళ్లేందుకు సిద్ధం అవుతుండగా.. లాక్‌డౌన్‌తో వీళ్ల ప్రయాణానికి బ్రేక్‌ పడింది. 

మరిన్ని వార్తలు