Advertisement

తాడు పేనినట్లే రక్తనాళాలను కూడా....!

15 Feb, 2020 12:11 IST|Sakshi

శరీరంలో ఏదైనా రక్తనాళం దెబ్బతిని.. దాన్ని తొలగించాలంటే కొంచెం కష్టంతో కూడుకున్న పనే. కృత్రిమ రక్తనాళాలను శరీరం ఓర్చుకోవాల్సి ఉంటుంది. ఇలా కాకుండా రోగి కొలేజన్‌తోనే రక్తనాళాలను తయారు చేసేందుకు ఫ్రాన్స్‌ శాస్త్రవేత్తలు ఓ వినూత్న ప్రయత్నం చేశారు. మానవ కణాలను పరిశోధన శాలలో పెంచడం ద్వారా ఉత్పత్తి అయ్యే ఎక్స్‌ట్రా సెల్యులార్‌ మ్యాట్రిక్స్‌ మ్యాట్రిక్స్‌ పదార్థాన్ని ఉపయోగించుకుని ఈ రక్తనాళాలు సిద్ధమవుతాయి. పొరలు పొరలుగా లభించే ఈ ఎక్స్‌ట్రా సెల్యులార్‌ మ్యాట్రిక్స్‌ పదార్థన్ని చిన్న చిన్న పోగుల్లా కత్తిరించడం, చేంతాడును పేనినట్లు ఈ పోగులతో రక్తనాళాలను పేనడం ఈ కొత్త పద్ధతిలోని ప్రక్రియ.

ఇవి కుట్లు వేసినా పగిలిపోనంత దృఢంగా ఉంటాయని, ఒత్తిడికి పగిలిపోనూ పోవని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. రోగి శరీరం నుంచి సేకరించిన కణాలతోనే రక్తనాళాలను తయారు చేయడం వల్ల వీటిని రోగ నిరోధక వ్యవస్థ తిరస్కరించే  అవకాశాలు కూడా చాలా తక్కువ. ఈ కొత్త రకం రక్తనాళాలు కావాల్సిన ప్రమాణాలన్నీ కలిగి ఉన్నట్లు ఇప్పటికే రుజువు కాగా, త్వరలోనే ఈ రక్తనాళాలను జంతువులపై ప్రయోగించి చూడనున్నారు. ఆ తరువాత మానవుల్లోనూ ప్రయోగాలు చేపట్టి అందరికీ అందుబాటులోకి తెస్తారు. పరిశోధన పూర్తి వివరాలు అక్ట్రా బయో మెటీరిలియా అనే జర్నల్‌లో ఇటీవలే ప్రచురితమయ్యాయి.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బ్యాండేజీ తీయకుండానే మందులు వేస్తారు!

ఖురాన్‌ ఏం చెప్పిందో గీతా అదే వివరిస్తోంది..

అనుకోకుండా హ్యాపీ'షెఫ్‌'

ఇలాంటి పెళ్లికి ఏ సర్టిఫికెట్‌ ఇవ్వాలో..!!

ఇంత సన్నగైపోయావేందిరా..

సినిమా

స్టార్‌ హీరోయిన్‌తో ఐదేళ్ల ప్రేమాయణం..!

నటుడు ఉదయ్‌ కిరణ్‌ హఠాన్మరణం

‘అలా బతకడంలో తప్పు లేదు.. కానీ!’

టాలీవుడ్‌లో ఓరుగల్లు దర్శకుల హవా

సూపర్‌ హీరో శక్తి

నేను లేని నా ప్రేమ