ఫంగస్‌ ఫ్యాక్టరీలు  వచ్చేస్తున్నాయి...

9 Nov, 2018 01:01 IST|Sakshi

వస్త్రం మొదలుకొని రోజువారీ వ్యవహారాల్లో మనం వాడే కాస్మోటిక్స్, సబ్బుల వంటి అనేక వస్తువుల తయారీకి మూల పదార్థం ముడిచ మురు! ఈ చమురేమో పర్యావరణానికి హాని కలిగించేది. ఈ నేపథ్యంలో ఫ్రాన్‌హోఫర్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు కేవలం ఫంగస్‌ సాయంతో వాణిజ్యస్థాయిలో ఇలాంటి ఉత్పత్తులన్నింటినీ సిద్ధం చేసేందుకు ఓ వినూత్న టెక్నాలజీని అభివద్ధి చేశారు. బ్రెడ్‌లాంటి వాటికి పట్టే బూజు గురించి మీకు తెలిసే ఉంటుంది. తెల, పచ్చ రంగుల్లో ఉండే ఈ బూజే ఫంగస్‌. ఆస్పెర్‌గిల్లస్‌ అనేది ఫంగస్‌ జాతిలో ఒకటి.

వీటికున్న ప్రత్యేకత ఏమిటో తెలుసా? కార్బన్‌డైయాక్సైడ్‌ వంటి విషవాయువులేవీ విడుదల చేయకుండానే ఇవి అనేక రకాల రసాయనాలను తయారు చేయగలవు. కాకపోతే ఇప్పటివరకూ వీటిని వాణిజ్య స్థాయిలో తయారు చేయడం మాత్రం వీలు కాలేదు. ఈ నేపథ్యంలో ఫంగస్‌కు అవసరమైన ఆహారంలో మార్పులు చేయడం ద్వారా నిర్దిష్టమైన రసాయనాలను ఉత్పత్తి చేయవచ్చునని ఫ్రాన్‌హోఫర్‌ శాస్త్రవేత్తలు గుర్తించారు. తగిన విధంగా వాడుకుంటే ఫంగస్‌ ద్వారా మాలిక్‌ ఆసిడ్‌ నుంచి పాలియేస్టర్ల వరకూ అనేక రసాయనాలను ఉత్పత్తి చేయవచ్చునని వీరు అంటున్నారు. 

మరిన్ని వార్తలు