తమాషా పదాలు... తీరైన సంభాషణలు

19 Jan, 2015 23:03 IST|Sakshi
తమాషా పదాలు... తీరైన సంభాషణలు

తమాషా పేర్లు, కోర్ట్ సీన్స్‌తో మొదలైన ఇది మల్లాది సీరియల్ అనే నమ్మకం మొదట్లో కుదరలేదు. మెక్‌డోనాల్డ్స్‌లో కోక్ ఎన్నిసార్ల్లైనా నింపుకోవడం లాంటివి మనలో చాలామంది గమనించి ఉండరు. సినిమాటిక్‌గా ఒక్కో హీరో ఒక్కో కథతో ఎంట్రీ, వీరందర్నీ పాత స్నేహితులుగా అతికించినట్లు కనిపించింది. కాలేజ్ ఫంక్షన్‌లోని జోక్స్ ఫేస్‌బుక్‌తో పరిచయం లేని పాఠకులకి ఉపయోగం. గోలచందర్ కథ, దుర్యోధన్‌ని త్రీమంకీస్ బెదిరించడం, వాటర్ క్యూబ్స్‌ని వాటర్ విత్ కార్నర్స్‌గా చెప్పడం లాంటి తమాషా పదాలు సీజనాత్మకం. పట్టయ్య అంత్యాక్షరి ద్వారా చెప్పిన పాత సినిమా పాటలు నాకు హాయిగా అనిపించాయి. పోలీసులకి, దొంగలకి మధ్య వానర్ మధ్యవర్తిత్వం హాస్యంగా సాగింది. వాళ్ళు అన్ని కోట్లు సులువుగా కొట్టేసినా ‘ఈజీ మనీ నాట్ క్రేజీ’ అని చెప్పడం కరెక్ట్. ఎందుకంటే ముందుగానే ‘డబ్బు తాబేలులా వస్తుంది.

కుందేలులా పోతుంది’ అని చెప్పారు కదా! బియాండ్ లిమిట్స్‌కి వెళ్ళకుండా, పరుగులు పెట్టకుండా కథని నడపడం మల్లాది ప్రత్యేకత. ఒకే ఒక్క ఫోన్‌కాల్‌తో సీరియల్‌ని ముగింపుకి తెచ్చేశారు. దీన్లోని పాత్రలన్నీ ఒక ఎత్తు. వేమన పాత్ర ఒక ఎత్తు. ఇలాంటి సీరియల్‌లో అలాంటి పాత్ర ద్వారా వేదాంత సారాన్ని  చేర్చడం అభినందనీయం. ‘నీకో సమస్య ఉందని దేవుడికి చెప్పకు. సమస్యకి నీకో దేవుడున్నాడని చెప్పు’ లాంటి ఎక్స్‌లెంట్ డైలాగ్స్ చాలా రాశారు.                            
 - వి శశికళ, నాయుడుపేట (నెల్లూరు జిల్లా)
 
త్రీమంకీస్  సీరియల్‌పై పాఠకుల అభిప్రాయాలు

 
మా ప్రకటనకు స్పందనగా త్రీ మంకీస్ సీరియల్ మీద చాలామంది పాఠకులు తమ విలువైన అభిప్రాయాలను పంపించారు. వాటిలో ఉత్తమమైనవిగా రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి ఎంపిక చేసిన మూడిటిని  రోజుకొకటి చొప్పున ప్రచురిస్తున్నాం. నిన్న మొదటి అభిప్రాయం ప్రచురించాం. ఇవాళ్టిది రెండోది. ఇలా ఎంపిక చేసిన ముగ్గురికి ముందుగా ప్రకటించినట్లు ఒక్కొక్కరికి రూ. 500/- నగదు బహుమతి రచయిత పంపుతారు. వీటిని పుస్తక రూపంలో  వచ్చే నవలలో కూడా ప్రచురిస్తారు.
 
 
 

మరిన్ని వార్తలు