గ్రహాల నాడి తెలిపే రచన

28 Oct, 2018 01:27 IST|Sakshi

తమ భవిష్యత్తు ఎలా ఉన్నదో తెలుసుకోడం కోసం కొందరు హస్తసాముద్రికాన్ని ఆశ్రయిస్తే, మరికొందరు సంఖ్యాశాస్త్రాన్ని, ఇంకొందరు పుట్టుమచ్చల శాస్త్రాన్నో, జ్యోతిషాన్నో ఆశ్రయిస్తారు. వీరేగాక చిలక జోస్యాన్నీ, కోయదొరల పలుకులనీ, సోది చెప్పేవారి మాటలనూ పరిగణనలోకి తీసుకునేవారూ కోకొల్లలు. రోగి నాడి పట్టుకుని రోగ లక్షణాలను వైద్యుడు తెలుసుకున్నట్టే, జాతకుడి లక్షణాలను అతడి నాడి ద్వారా జ్యోతిష్యుడు తెలుసుకోగలడు. అయితే, నాడీజ్యోతిషంలో  కొందరు పరాశరనాడిని అనుసరిస్తే ఇంకొందరు భృగు పద్ధతిని, మరికొందరు కనీనిక నాడిని అనుసరిస్తారు.

చాలామంది జ్యోతిషులు లగ్నాన్ని ఆధారంగా చేసుకుంటారు. కొంద రు శనిగ్రహాన్ని, మరికొందరు బుధగ్రహాన్నీ పరిశీలించి చెబుతారు. అయితే, ‘ప్రశ్నహోరా’, ‘పాపగ్రహాలు– పరిహారాలు’ పుస్తక రచయిత పామర్తి హేమసుందరరావు భృగునాyì మరింత కీలకమంటూ, ఆ నాడి ద్వారా ఏమేం తెలుసుకోవచ్చో వివరించారు. టైటిల్‌ను బట్టి ఈ పుస్తకం చదివితే ఎవరికి వారే తమ జాతకాన్ని తెలుసుకోవచ్చేమో అనిపిస్తుంది. అయితే వివిధ రకాల నాడీ జ్యోతిషాల గురించి తెలిసిన వారికి, జ్యోతిషాన్ని నేర్చుకుంటున్నవారికే ఈ పుస్తకం ఎక్కువ ఉపకరిస్తుంది. రచయిత సీనియర్‌ పాత్రికేయులు కావడంతో పుస్తకాన్ని ఆసక్తికరంగా మలచడంలోనూ, వాడుకభాషలో రాయడంలోనూ సాఫల్యాన్ని సాధించారు.       

మరిన్ని వార్తలు