హెల్దీ హెయిర్... గ్లోయింగ్ ఫేస్..

9 May, 2015 23:47 IST|Sakshi
హెల్దీ హెయిర్... గ్లోయింగ్ ఫేస్..!

బ్యూటీ టిప్స్
 
బంగాళదుంపను సన్నగా తురిమి, పిండి రసం తీయాలి. దానిలో కోడిగుడ్డు తెల్లసొన, పెరుగు కలిపి కుదుళ్లకు పట్టించి... గంట తర్వాత గోరువెచ్చని నీటితో తలంటుకోవాలి. వారానికోసారి ఇలా చేస్తే జుత్తు ఆరోగ్యంగా పెరుగుతుంది.పెదవులు పాలిపోయినట్టుగా అయితే... చక్కెర కరిగించిన నీటిలో బీట్‌రూట్ ముక్కను కాసేపు నానబెట్టి, తర్వాత దానితో పెదవులు రుద్దాలి. దాంతో చక్కని రంగును సంతరించుకోవడమే కాక ఆరోగ్యంగా ఉంటాయి.

రెండు క్యారెట్లను, ఒక బంగాళదుంపను ఉడికించి, మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమంలో కాస్త పెరుగు కలిపి ప్యాక్ వేసుకుని, ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. రెండు వారాలకోసారి ఇలా చేస్తే ముఖమ్మీది ముడతలు తొలగిపోతాయి.

మరిన్ని వార్తలు