చాక్లెట్‌ మిల్క్‌తో చాలా మేలు

17 Jul, 2018 00:16 IST|Sakshi

జిమ్‌లో బాగా వ్యాయామం చేసి వచ్చిన తర్వాత ఖరీదైన స్పోర్ట్స్‌ డ్రింక్స్‌ తాగడం కంటే చాక్లెట్‌ మిల్క్‌ తాగడం మంచిదని ఒక తాజా పరిశోధనలో తేలింది. స్పోర్ట్స్‌ డ్రింక్స్‌తో పోలిస్తే చాక్లెట్‌ మిల్క్‌ తాగడం వల్ల గుండె వేగం త్వరగా అదుపులోకి వస్తుందని, శరీరంలోని లాక్టిక్‌ యాసిడ్‌ పరిమాణం కూడా సాధారణ స్థితికి చేరుకుంటుందని ఇరాన్‌లోని షహీద్‌ సదౌఘీ యూనివర్సిటీకి చెందిన పోషకాహార నిపుణులు జరిపిన పరిశోధనలో వెలుగులోకి వచ్చింది. ఇతర స్పోర్ట్స్‌ డ్రింక్స్‌ కంటే చాక్లెట్‌ మిల్క్‌లో కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయని వారు చెబుతున్నారు.

వ్యాయామం వల్ల కోల్పోయిన శక్తిని సత్వరమే పుంజుకొనేందుకు, వ్యాయామం వల్ల కలిగిన అలసట నుంచి కండరాల నొప్పుల నుంచి త్వరగా తేరుకునేందుకు చాక్లెట్‌ మిల్క్‌ చక్కని పానీయమని షహీద్‌ సదౌఘీ వర్సిటీ పరిశోధన బృందానికి నేతృత్వం వహించిన డాక్టర్‌ అమీన్‌ సలేహీ అబర్గోయీ చెబుతున్నారు. ప్రతిరోజూ వ్యాయామం చేసే అలవాటు గల 150 మందిపై పన్నెండు విడతలుగా జరిపిన అధ్యయనాల్లో ఈ మేరకు నిర్ధారణకు వచ్చినట్లు ఆయన వివరించారు. 
 

మరిన్ని వార్తలు