మంచి కొవ్వుల కోసం చేపలు తినడం మేలు...

8 Oct, 2015 23:50 IST|Sakshi

కార్డియాలజీ  కౌన్సెలింగ్
 
 నా వయసు 44 ఏళ్లు. నేను కొవ్వులతో కూడిన ఆహారం ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను.  దీనివల్ల గుండె దెబ్బతింటుందని చాలామంది ఫ్రెండ్స్ చెబుతున్నారు. ఇది నిజమేనా? నాకు తగిన సలహా ఇవ్వగలరు.
 - కె. జీవన్ కుమార్, భువనగిరి


కొలెస్ట్రాల్ అనే కొవ్వులలో రెండు రకాలు ఉంటాయి. మొదటిది ఒంటికి మేలు చేసే కొవ్వులు. వీటిని హైడెన్సిటీ లైపో ప్రొటీన్ (హెచ్‌డీఎల్)అంటారు. ఇవి గుండె తెల్లసొనలో ఉంటాయి. శరీరానికి హానికారకమైన కొవ్వులను ఎల్‌డీఎల్ (లో డెన్సిటీ లైపో ప్రొటీన్స్) అంటారు. చెడు కొలెస్ట్రాల్ వంటి కొవ్వులు గుండెజబ్బులకు ఒక రిస్క్ ఫాక్టర్. ఈ తరహా కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారం తినేవారిలో, ఫాస్ట్ ఫుడ్ తీసుకునే వారిలో గుండెజబ్బుల రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అయితే రక్తంలో ఈ రెండు రకాల కొవ్వులు కలుపుకొని 200 లోపు ఉండాలి. ఎల్‌డీఎల్ 100 లోపు, హెచ్‌డీఎల్ 40పైన ఉండాలి. అలాగే ట్రైగ్లిజరైడ్స్ అనే మరో రకం కొవ్వులు కూడా గుండెకు హాని చేస్తాయి. ఇవి 150 లోపు ఉండాలి. కొలెస్ట్రాల్ మన శరీరంలోకి రెండు రకాలుగా చేరుతుంది. ఒకటి ఆహారం ద్వారా, మరొకటి లివర్ పనితీరు వల్ల. శిశువు పుట్టినప్పుడు 70 మి.గ్రా. కొలెస్ట్రాల్ ఉంటుంది. మెదడు నరాల వ్యవస్థ కోసం, శిశువు రెండేళ్ల పాటు ఎదగడానికి ఈ కొలెస్ట్రాల్ కొవ్వులు ఉపయోగపడతాయి. ఆ తర్వాత దీని అవసరం అంతగా ఉండదు. అయితే జన్యుతత్వాన్ని బట్టి ఈ కొవ్వులు (మంచి, చెడు ఈ రెండు రకాల కొలెస్ట్రాల్స్) ఉత్పత్తి అవుతూనే ఉంటాయి. వేపుళ్లు, బేకరీ పదార్థాలు, కృత్రిమ నెయ్యి వంటి పదార్థాలను ఎక్కువగా తినేవాళ్లలో ఈ కొవ్వు పేరుకుంటూ ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి అంత మంచిది కాదు.

ఇక కొందరిలో కొలెస్ట్రాల్ పాళ్లు ఎక్కువగా ఉన్నవారికి డాక్టర్లు వాటిని అదుపు చేసే మందులు ఇస్తుంటారు. ఈ తరహా మందులు వాడుతున్న వారు మధ్యలో వాటిని మానేయకూడదు. మీరు మాంసాహారం పూర్తిగా మానేయలేకపోతే... కొవ్వులు తక్కువగా ఉండే చేపలు, చికెన్ వంటి వైట్‌మీట్ తీసుకోండి. ఇందులో చికెన్ కంటే చేపలు చాలా మంచిది. కాబట్టి మాంసాహారం తీసుకునే బదులు చేపలు తినండి.
 
ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్

నా వయసు 28 ఏళ్లు. నాకు మూడేళ్ల కిందట కుడివైపు తుంటి భాగంలో తీవ్రమైన నొప్పి వచ్చింది. అప్పుడు డాక్టర్‌ను కలిశాను. కుడి తుంటి ఎముకలో గుండ్రగా బంతిలా ఉండే భాగానికి రక్తసరఫరా తగ్గిందని, డ్రిల్ వేసి దానికి రక్తసరఫరా జరిగేలా శస్త్రచికిత్స చేయాలని అన్నారు. దాంతో ఆ సర్జరీ చేయించుకున్నాను. ఆ తర్వాత కూడా నొప్పి వస్తోంది. ఇప్పుడు నడవడం కూడా కష్టమవుతోంది. డాక్టర్‌ను కలిస్తే పూర్తి తుంటి మార్పిడి (హిప్ జాయింట్ రీప్లేస్‌మెంట్) శస్త్రచికిత్స చేయాలంటున్నారు. ఇంత చిన్న వయసులో అలాంటి శస్త్రచికిత్స చేయించుకోవాలంటే భయంగా ఉంది. నాకు తగిన సలహా ఇవ్వండి.
 - అబ్దుల్లా, వరంగల్


మీరు చెబుతున్న విషయాలను బట్టి మీరు అవాస్క్యులార్ నెక్రోసిస్ అనే కండిషన్‌తో బాధపడుతున్నారనిపిస్తోంది. మీ డాక్టర్ చెప్పినట్లుగా అది కొన్నిసార్లు డ్రిల్లింగ్ ప్రక్రియతో నయమవుతుంది. అయితే చాలా సందర్భాల్లో అది ఆర్థరైటిస్‌గా మారి, చాలా బాధాకరంగా పరిణమిస్తుంది. నొప్పి చాలా తీవ్రంగా ఉంటే మీ డాక్టర్ చెప్పినట్లు హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేయించుకోవాలి. ఇది పెద్ద శస్త్రచికిత్స (మేజర్ సర్జరీ) అయినప్పటికీ, వైద్య విజ్ఞానంలో ఇప్పుడు లభ్యమవుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వల్ల దీని విజయావకాశాలు 100 శాతం ఉంటాయి. నొప్పి కూడా చాలా తక్కువే. రెండుమూడు రోజుల్లోనే మీరు నడక మొదలుపెట్టవచ్చు. ఈ సర్జరీ ఫలితాలు దాదాపు 30 ఏళ్లపాటు ఉంటాయి. కాబట్టి మీకు మరీ భరించలేనంత నొప్పి వస్తుంటే మీ డాక్టర్ చెప్పినట్లుగా హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేయించుకోవడమే మంచి మార్గం.
 
నాకు ఐదేళ్ల క్రితం జరిగి ప్రమాదంలో ముంజేతికి శస్త్రచికిత్స చేసి, ప్లేట్లు, స్క్రూలు బిగించారు. ఇప్పుడు వాటిని తప్పనిసరిగా తొలగించాలా?
 - సురేశ్, భీమవరం

 ఇలా ఆపరేషన్ కోసం బిగించిన ప్లేట్లు, స్క్రూలను ప్రతిసారీ తొలగించాల్సిన అవసరం ఉండదు. కాళ్ల విషయంలో అయితే తప్పనిసరిగా వాటిని తొలగించాలి. మీరు చెయ్యికి ప్లేట్లు వేశారంటున్నారు కాబట్టి ఎలాంటి సమస్యా లేకపోతే వాటిని తొలగించాల్సిన అవసరం లేదు. కానీ మళ్లీ ఫ్రాక్చర్ అయితే ప్రమాదం కాబట్టి వాటిని తొలగిస్తుంటారు. కాబట్టి మీ సౌకర్యాన్ని బట్టి నిర్ణయం తీసుకోండి.
 
పీడియాట్రిక్ కౌన్సెలింగ్

 
మా పాప వయసు ఏడేళ్లు. కొన్నాళ్ల క్రితం గొంతు నొప్పి అంటే డాక్టర్‌కు చూపించాం.  పాప నోటిలో, నాలుక మీద, గొంతులోపలి భాగంలో రెండు మూడుసార్లు పుండ్లలాగా వచ్చాయి. చాలా నొప్పిగా ఉంటోందని చెబుతోంది. గొంతు అంతా ఎర్రబారింది. తినడానికి వీలుగాక విపరీతంగా ఏడుస్తోంది. మా పాప సమస్యకు మంచి సలహా ఇవ్వండి.
 - షహనాజ్, నెల్లూరు

మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీ పాపకు పదే పదే నోటిలో పుండ్లు (మౌత్ అల్సర్స్) వస్తున్నాయని తెలుస్తోంది. పిల్లల్లో ఈ సమస్య చాలా సాధారణం. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు... ఉద్వేగపరమైన ఒత్తిడి (ఎమోషనల్ స్ట్రెస్), బాగా నీరసంగా అయిపోవడం (ఫెటీగ్),  విటమిన్‌లు, పోషకాల లోపం... (ఇందులోనూ విటమిన్ బి12, ఐరన్, ఫోలిక్ యాసిడ్, జింక్ ల వంటి పోషకాలు లోపించడం) వైరల్ ఇన్ఫెక్షన్‌లు (ముఖ్యంగా హెర్పిస్ వంటివి)  గాయాలు కావడం (బ్రషింగ్‌లో గాయాలు, బాగా ఘాటైన పేస్టులు, అబ్రేసివ్ ఫుడ్స్  వంటి కొన్ని ఆహారపదార్థాల వల్ల అయ్యే గాయాల కారణంగా)  
 
పేగుకు సంబంధించిన సమస్యలు, రక్తంలో మార్పులు, గ్లూటిన్ అనే పదార్థం పడకపోవడం, తరచూ జ్వరాలు రావడం... వంటి అనేక రకాల ఆరోగ్య సమస్యల వల్ల పిల్లలకు తరచూ నోటిలో పుండ్లు (మౌత్ అల్సర్స్) వస్తుంటాయి. మీరు చెప్పిన కొద్దిపాటి వివరాలతో నిర్దిష్టంగా ఇదీ కారణం అని చెప్పలేకపోయినా... మీ పాపకు విటమిన్‌ల వంటి పోషకాల లోపం లేదా తరచూ వన్చే ఇన్ఫెక్షన్స్‌తో ఈ సమస్య వస్తున్నట్లు భావించవచ్చు.
 
ఇలాంటి పిల్లలకు నోటిలో బాధ తెలియకుండా ఉండేందుకు పైపూతగా వాడే మందులు, యాంటిసెప్టిక్ మౌత్ వాష్‌లు, విటమిన్ సప్లిమెంట్స్ వాడాల్సి ఉంటుంది. ఇలాంటి పిల్లల్లో చాలా అరుదుగా స్టెరాయిడ్ క్రీమ్స్ వాడటం వల్ల ప్రయోజనం  ఉంటుంది. మీరు పైన పేర్కొన్న అంశాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ మరోసారి మీ పిల్లల వైద్య నిపుణుడినిగానీ లేదా దంత వైద్య నిపుణుడిని గాని సంప్రదించి వారి ఆధ్వర్యంలో తగిన చికిత్స తీసుకోండి. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఇలా పకోడీ అయ్యింది

భుజియాతో బిలియన్లు...

చర్మకాంతి పెరగడానికి...

ఈ నిజాన్ని ఎవరితోనూ చెప్పకండి

పనే చెయ్యని మగాళ్లతో కలిసి పని చేసేదెలా?!

దయ్యం టైప్‌ రైటర్‌

వారఫలాలు (జులై 27 నుంచి ఆగస్ట్‌ 2 వరకు)

తల్లిదండ్రుల అభిప్రాయాలు పిల్లలపై రుద్దడం సరికాదు

‘నువ్వేం చూపించదలచుకున్నావ్‌?’

ఆస్వాదించు.. మైమ‘రుచి’

సమస్త ‘ప్రకృతి’కి ప్రణామం!

జీ'వి'తం లేని అవ్వా తాత

అక్షర క్రీడలో అజేయుడు

కడుపులో దాచుకోకండి

చౌకగా కేన్సర్‌ వ్యాధి నిర్ధారణ...

జాబిల్లిపై మరింత నీరు!

క్యాన్సర్‌... అందరూ తెలుసుకోవాల్సిన నిజాలు

అతడామె! జెస్ట్‌ చేంజ్‌!

ఆరోగ్య ‘సిరి’ధాన్యాలు

ఒకేలా కనిపిస్తారు.. ఒకేలా అనిపిస్తారు

షూటింగ్‌లో అలా చూస్తే ఫీలవుతాను

ఇదీ భారతం

మూర్ఛకు చెక్‌ పెట్టే కొత్తిమీర!

మంచి నిద్రకు... తలార స్నానం!

నేత్రదానం చేయాలనుకుంటున్నా...

హలో... మీ అమ్మాయి నా దగ్గరుంది

రియల్‌ లైఫ్‌ లేడీ సింగం

కోటల కంటే ఇల్లే కష్టం

గర్భవతులకు నడక మంచి వ్యాయామం!

ఇక ద్రవాలూ అయస్కాంతాలే!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సంపూ ట్వీట్‌.. నవ్వులే నవ్వులు

బిగ్‌బాస్‌.. జాఫర్‌, పునర్నవి సేఫ్‌!

దిల్ రాజు ప్యానల్‌పై సీ కల్యాణ్ ప్యానల్‌ ఘనవిజయం

ఇది ‘మహర్షి’ కలిపిన బంధం

ప్రేమలో పడ్డ ‘చిన్నారి’ జగదీశ్‌!

కన్నడనాట ‘కామ్రేడ్‌’కి కష్టాలు!