గుడ్‌ ఫుడ్‌

1 Apr, 2018 00:28 IST|Sakshi

బొప్పాయి నుంచి వచ్చే పాలలో నెయ్యిని కలిపి కొద్దిగా తీసుకుంటే... అజీర్తి వల్ల కలిగిన కడుపునొప్పి తగ్గుతుంది. అలాగే బొప్పాయి గింజలను ఎండబెట్టి పొడి చేసి, నేతితో కలిపి రోజూ కాస్త తీసుకుంటే... కడుపులో ఉన్న పురుగులు నశిస్తాయి.
 పొడిచర్మం త్వరగా ముడతలు పడుతుంది. కాబట్టి ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ముఖానికి ఆముదం కాని, కొబ్బరి నూనె కాని రాసి ఉదయం వరకు అలాగే ఉంచాలి. కొబ్బరి నూనె అయితే ముఖమంతా రాయవచ్చు. ఆముదం అయితే కళ్ల చుట్టూ ప్రదేశాన్ని మినహాయించాలి. కొంతమందికి కళ్ల దగ్గర ఆముదం రాస్తే ఇరిటేషన్‌తో చర్మం ఎర్రబడుతుంది.
 ఒక కప్పు ముల్తానీ మట్టిని తీసుకుని... అందులో ఒక గుడ్డు తెల్లసొన, రెండు చెంచాల బియ్యపు పిండి, కాసిన్ని నీళ్లు కలిపి పేస్టులాగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుత్తుకు, మాడుకు బాగా పట్టించి... ఆరిన తరువాత గోరు వెచ్చని నీటితో తలంటు కోవాలి. కొన్నాళ్లపాటు వారానికోసారి ఇలా చేస్తే జుత్తు బలపడుతుంది. సిల్కీగా తయారవుతుంది.

మరిన్ని వార్తలు