గజిబిజి టెక్స్ట్‌కు గుడ్‌బై...

25 Feb, 2015 00:25 IST|Sakshi
గజిబిజి టెక్స్ట్‌కు గుడ్‌బై...

ఈమెయిళ్లుగానీ, వెబ్‌సైట్ల నుంచి కాపీ చేసుకున్న టెక్స్ట్ కానీ... వర్డ్‌ప్రాసెసర్ ద్వారా ప్రింట్ చేశామనుకోండి. రకరకాల గుర్తులతో, అక్షరాలు దూరదూరంగా ప్రింట్ అవుతాయి. ఒరిజినల్ టెక్ట్స్‌లో ఉన్న ఫార్మాట్‌ల ఫలితమిది. వీటిని సులువుగా తొలగించుకునేందుకు ఎన్నో ఆప్షన్లున్నాయి. వాటిల్లో మచ్చుకు మూడు మీకోసం...

స్ట్రిప్ మెయిల్: నెట్‌లో (ఠీఠీఠీ.ట్టటజీఞఝ్చజీ.్ఛ్ట) ఉచితంగా లభించే చిన్న సాఫ్ట్‌వేర్ ఇది. అన్ని రకాల ఈమెయిల్ క్లైయింట్లతో పనిచేస్తుంది. ఫార్వర్డ్ చేసిన మెయిళ్లలో మామూలుగా కనిపించే కొన్ని గుర్తులను చెరిపేసి... టెక్ట్స్ సాఫీగా ఉండేలా చేస్తుంది. అక్షరాలు మొత్తం కుడివైపు నుంచి కుదురుగా మొదలవడంతోపాటు పేరాలుగా ఉండేలా చేస్తుంది. కేవలం 279 కిలోబైట్ల సైజుండే ఈ సాఫ్ట్‌వేర్‌ను డెస్క్‌టాప్‌పై ఉంచుకుని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. తద్వారా టెక్ట్స్ చూడటానికి బాగా కనిపిస్తుంది. కాగితం వృథా కాదు కూడా.
 ఈమెయిల్ స్ట్రిప్పర్: మెయిల్ ఫార్వర్డ్ చేసిన ప్రతిసారీ లైన్ మొదలయ్యే చోట ’ాాాా ’ గుర్తులు కనిపించడం మనం చూసే ఉంటాం. ఈ మెయిల్‌స్ట్రిప్పర్ సాఫ్ట్‌వేర్‌తో ఈ ఇబ్బందికి చెక్ పెట్టవచ్చు. ఎన్నిసార్లు ఫార్వర్డ్ చేసిన మెయిలైనా ఒకసారి దీంట్లో పడితే క్లీన్‌గా మారిపోతుంది. ఈమెయిల్‌లోని సమాచారం మొత్తాన్ని ఈ సాఫ్ట్‌వేర్‌లో పడేయడం ఒక్కటే మీరు చేయాల్సింది. ఆ తరువాత మీరు యథావిధిగా టెక్స్ట్‌ను కాపీ చేసి మెయిల్‌లో పేస్ట్ చేసి వాడుకోవచ్చు. సీనెట్ వంటి సైట్లలో ఉచితంగా లభిస్తుంది. ఈ సాఫ్ట్‌వేర్ అన్ని వెర్షన్ల విండోస్‌తో, లీనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌తోనూ పనిచేయగలదు.

క్లిప్పీ: ఫార్వర్డ్ చేసిన మెయిళ్లలో హెచ్‌టీఎంఎల్ ట్యాగ్‌లతోపాటు అనవసరమైన గుర్తులన్నింటినీ చెరిపేసి టెక్ట్స్‌ను కంటికి నదురుగా మార్చి ఇస్తుంది ఈ క్లిప్పీ సాఫ్ట్‌వేర్. రీఫార్మాట్ చేయాల్సిన టెక్స్ట్‌ను క్లిప్‌బోర్డ్‌లో పేస్ట్ చేసి సిస్టమ్ ట్రేలో ఉన్న క్లిప్పీ ఐకాన్‌ను క్లిక్ చేస్తే చాలు. దీంతోపాటు పదాలను లెక్కించేందుకు, పదాల మధ్యలో ఉండే అనవసరమైన వైట్ స్పేసెస్‌ను తొలగించేందుకు, కొన్ని ఇతర పనులకు కూడా ఉపయోగించుకోవచ్చు. అన్ని విండోస్ ఓఎస్ వెర్షన్లతో పనిచేస్తుంది.
 

మరిన్ని వార్తలు