నెట్‌ఇంట్లో

16 Nov, 2015 00:28 IST|Sakshi
నెట్‌ఇంట్లో

మడుగు అట్టడుగున దాగున్న దుర్యోధనుడిని రెచ్చగొట్టితే తప్ప బయటకి రాలేదు. ఇంటర్‌నెట్ గొప్పతనం ఏమిటంటే సరస్సు అడుగున తొమ్మిదేళ్లుగా శాశ్వత నిద్రలో ఉన్నవాడు కూడా ఇంటర్ నెట్ దృష్టిని తప్పించుకోలేదు. ఇంటర్‌నెట్ విచిత్రాలు ఇన్నిన్ని కావు. ఎక్కడ ఏం జరిగినా చటుక్కున పట్టేసి ప్రపంచానికి అందిస్తుంది. ఏ మూలన ఏ రహస్యం దాగున్నా చిటికలో ఛేదిస్తుంది.

బాల్యం నుంచి వార్ధక్యం దాకా, పుట్టుక నుంచి చావు దాకా... ఇంటర్‌నెట్ నుంచి ఏమీ దాగవు. చూయింగ్ గమ్ అతికించే ప్రేమికుల గోడను శుభ్రపరచడం నుంచి, పాలెస్తీనాలోని ఓ ఇంట్లో బాలుడికి రక్తం చిందించడం నేర్పడం దాకా ఏవీ నెట్ కళ్ల నుంచి తప్పించుకోలేవు. ఇంటర్ నెట్ పశ్నలు లేవనెత్తుతుంది. సమాధానాలనిస్తుంది. కుదుపుతుంది. కుదుటపరుస్తుంది. ఆ నెట్టింటి కబుర్లు మీ కోసం...


గోడ-గోడు (చూయింగ్ గమ్‌లాంటి లవ్‌స్టోరీ)
 చూయింగ్ గమ్‌కి ప్రేమకి సంబంధం ఏమిటి? చూయింగ్ గమ్‌లా ప్రేమ కూడా ఎంత సేపైనా కొనసా....గుతుందనా? లేక రెండు హృదయాలు అతుక్కుపోతాయనా? ఏమో తెలియదు కానీ ప్రేమికులకు చూయింగ్ గమ్‌కి ఉన్న సంబంధం తెలియాలంటే అమెరికాలోని సియాటిల్‌లో ఉన్న గమ్ వాల్‌కి వెళ్లాల్సిందే. అక్కడ ప్రేమికులు తమ హృదయాలను గమ్ వాల్‌కి చూయింగ్ గమ్ రూపంలో అతికించేసుకుంటారు. వివిధ రంగులు, వివిధ ఆకారాలున్న లక్షలాది చూయింగ్ గమ్‌లను దశాబ్దాలుగా అతికించేసుకుంటున్నారు.

ఓ రకంగా ఆ గోడ ప్రేమ చరితకు మౌన సాక్షి అన్న మాట. అందుకే ఎక్కడెక్కడి వాళ్లు అమెరికాలోని సియాటిల్‌కి వెళితే తప్పకుండా గమ్ వాల్‌ని చూసేందుకు వెళ్తారు. అయితే ఈ గమ్స్‌ను ఎలుకలు తెగ ప్రేమించేసుకుంటున్నాయట. దాంతో ఎలుకల్ని తరిమేసే ప్రయత్నంలో భాగంగా ఆ ప్రేమ చూయింగ్ గమ్‌లను ఇప్పుడు అధికారులు తొలగిస్తున్నారట. ఆ ఒక్క గోడకు 2000 పౌండ్ల బరువున్న చూయింగ్ గమ్ ఉందట మరి. అయితే ఇలా తమ ప్రేమ గుర్తులన్నీ కొట్టుకుపోతాయని ప్రేమికులు తెగ బాధపడిపోన్నారట.


గూగుల్ డిటెక్షన్
నెట్ నిజాల్ని తవ్వి తోడి తీస్తుంది. మిస్టరీలను ఛేదిస్తుంది. అలా ఓ గూగుల్ మ్యాప్ తొమ్మిదేళ్ల మిస్సింగ్ మిస్టరీని ఛేదించింది. ఇంటర్‌నెట్ ఇన్నేళ్ల రహస్యాన్ని బహిర్గతం చేసింది.తొమ్మిదేళ్ల క్రితం 72 ఏళ్ల డేవిడ్ లీ నైల్స్ చనిపోయాడు. 2006 అక్టోబర్‌లో క్యాన్సర్ బాధితుడైన నైల్స్ ఒక మిత్రుడి ఇంటి నుంచి ఉన్నట్లుండి బయలుదేరాడు. ఆ తరువాత ఆయన అజా అయిపూ లేకుండా పోయాడు. అప్పట్నుంచీ అతని కోసం ఎంతో వెతికారు. కానీ జాడ తెలియలేదు. చివరికి తొమ్మిదేళ్ల తరువాత గూగుల్ మ్యాప్స్‌లో ఆయన ఇంటికి http://img.sakshi.net/images/cms/2015-11/81447613566_Unknown.jpgదగ్గర్లో ఉన్న మిషిగన్ బైరాన్ టౌన్ షిప్‌లోని ప్రాంతాన్ని మిత్రుడొకరు చూస్తుంటే అందులో ఒక చెరువులో ఒక కారు జాడ కనిపించింది. గూగుల్ తీసిన ఏరియల్ ఇమేజ్‌లో నీటి అడుగు భాగంలో ఉన్న కారులో ఓ వృద్ధుని శరీరం ఉన్నట్లు గుర్తించారు. ఎప్పుడో 2006 అక్టోబర్ 11న తప్పిపోయిన డేవీ లీ నైల్స్... మిచిగన్.. బైరాన్ టౌన్ షిప్ లోని.. జేక్స్ బార్ అనే చెరువులో కనిపించాడు. చివరికి వెతికితే అందులోంచి నైల్స్ కారు, కారులో అతని అస్థిపంజరం లభించింది. అతని దంతాల సాయంతో అతడిని గుర్తించారు. గూగుల్ మ్యాప్స్ చిత్రంలో కారు పై భాగం స్పష్టంగా కనిపించింది. ఇలా తొమ్మిదేళ్ల తరువాత నైల్స్ అస్థిపంజరానికి అంతిమ సంస్కారాలు జరిగాయి. అతని సమాధిపై ‘డేవిడ్ లీ నైల్స్... ఎప్పుడు ఎలా చనిపోయాడో తెలియదు’ అని ఆయన బంధువులు రాశారు.  ఇలా గూగుల్ మ్యాప్స్ క్రైమ్ డిటెక్షన్‌లోనూ పనిచేస్తోంది.

 
మేక్ ఏ విష్

పట్టుమని ఇరవై ఎనిమిదేళ్లు లేవు. ప్రాణం తీసే క్యాన్సర్ పట్టుకుంది. ఆఖరి ఘడియలు సమీపిస్తున్నాయి. ఆ కుర్రాడు తన తీరని కోరిక గురించి మిత్రులకు చెప్పాడు. అదేమిటంటే పెళ్లి చేసుకోవాలి. అయితే మృత్యువు చేరువలో ఉన్న వాడినెవరు చేసుకుంటారు? అందుకే మనిషి రూపంలో, మనిషి సైజులో ఉన్న డాల్‌ని పెళ్లాడాలని నిర్ణయించుకున్నాడు. అంతే... మిత్రులు ఓ డాల్‌ను తెచ్చిచ్చారు. ఆ http://img.sakshi.net/images/cms/2015-11/61447613725_Unknown.jpgబొమ్మను పెళ్లికూతురులా అలంకరించారు. మనోడు పెళ్లికొడుకైపోయాడు. బొమ్మకు ఫీలింగ్సేమ ఉండవు కానీ, మనోడు మాత్రం పెళ్లిని ఒరిజినల్ పెళ్లిలానే ఫీలై అమ్మాయికి.. కాదు కాదు బొమ్మాయికి ఫుల్‌గా మేకప్ వేయించాడు. మోకాలిపై కూర్చుని నన్ను పెళ్లిచేకొమ్మని బొమ్మను అడిగాడు. వేలికి ఉంగరం తొడిగాడు. ముద్దు కూడా పెట్టుకున్నాడు. అరటి చెట్టుకి, కుక్కకీ ఇచ్చి పెళ్లి చేసే ఆచారాలున్న మనకు ఇందులో అంత ఆశ్చర్యం ఏమీ కనిపించకపోవచ్చు కానీ, పాశ్చాత్యులకు మాత్రం ఇది పరమ వింతగా కనిపిస్తోంది.

నెట్ మహిమ!!
నెట్టింట్లో ఏవి ఎందుకు షేర్ అవుతాయో చెప్పడం కష్టం. ఒకచోట వెండి తెర తారలు వైరల్ అయితే కొండొకచో బార్బర్ షాప్ యజమానీ వేననవేలుగా వైరల్ కావచ్చు. పోర్ట్ టాల్బట్ కి చెందిన జేమ్స్ విలియమ్స్ అనే బార్బర్ ఆటిజం వ్యాధితో బాధపడుతున్న ఒక బాలుడికి హెయిర్ కట్ చేశాడు. ఆ బాలుడి కోసం అతను పడ్డ అష్టకష్టాలు ఎవరో చూసి వీడియోలు తీసి, ఫోటో చేసి ఫేస్ బుక్‌లో పెట్టారు. అంతే.. ప్రజలకు ఎందుకు నచ్చిందో తెలియదు కానీ, తెగ షేర్ చేసేశారు. మేసన్ అనే కుర్రాడికి ఆటిజం వ్యాధి ఉంది. చెవి దగ్గరికి కత్తెర http://img.sakshi.net/images/cms/2015-11/71447613795_Unknown.jpgరానీయడు. దాంతో అతనితో ఆటలాడి, సెల్ ఫోన్ ఇచ్చి బిజీగా ఉంచి ఎలాగోలా పని కానిచ్చేశాడు. కూర్చుని, పడుకుని, పాకుతూ, దేకుతూ హెయిర్ కట్ చేశాడు. దీన్ని ఆయనకు తెలియకుండానే ఎవరో ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. అది అలా అలా అంతటా పాకిపోయింది. ‘థ్యాంక్స్ జిమ్ ఫర్ ది ట్రిమ్’ అని ఆ పిల్లవాడి తండ్రి కామెంట్ చేశాడు. నా కొడుకు నీ దగ్గరకే వస్తానంటున్నాడు అని కూడా అన్నాడు.  ఇప్పుడు జేమ్స్ విలియమ్స్ ఓర్పును, నేర్పును మెచ్చిన ఇతర తల్లిదండ్రులు కూడా జేమ్స్ విలియమ్స్ దగ్గర క్యూ కడుతున్నారట. నెట్ మహిమ మరి!!

కొత్త గాలి వీస్తోంది
కాలం మారింది. కాస్త డిఫరెంట్‌గా ఆలోచించండి  అని ఈ యాడ్ చెబుతోంది. సెన్సార్ బోర్డు సభ్యులు ఒక సినిమాని చూస్తుంటారు. కాస్త పాతకాలం ఆయన ‘‘ఫరవాలేదు. సినిమాకి యూ సర్టిఫికేట్ ఇచ్చేయండి’’ అంటాడు. కొత్తతరం ప్రతినిధి మాత్రం ‘‘లేదండీ ఈ సినిమాకి http://img.sakshi.net/images/cms/2015-11/51447613853_Unknown.jpg‘ఏ’ సర్టిఫికెట్ ఇవ్వాలి’’ అంటాడు. ‘‘ఇందులో ఎక్స్‌పోజింగ్ ఏముంది’’ అంటారు వాళ్లు ఆశ్చర్యంగా. ‘‘హీరో ఈ సినిమాలో ఏడు సార్లు టాప్ లెస్‌గా కనిపించాడు’’ అంటాడు మన కుర్రాడు. అంతా నవ్వుతారు.



‘‘అదేమిటండీ... అమ్మాయి టాప్ లెస్ అయితే న్యూడ్... అబ్బాయి టాప్ లెస్ అయితే డ్యూడ్ ఎలా అవుతాడు’’ అని ప్రశ్నిస్తాడు. నిజమే కదా... మనలోనూ ఆలోచనను రేకెత్తించే యాడ్ ఇది. ఇది కొత్త గాలి వీస్తోందని చెప్పే ఓ ఫ్యాన్ యాడ్ అయినా మనల్ని షేక్ చేసే ఓ సీరియస్ పశ్న వేసి, మన ద్వంద్వ ప్రమాణాలను ఎత్తి చూపుతుంది.

 

మరిన్ని వార్తలు