గోరంత అందానికి

15 Oct, 2014 23:15 IST|Sakshi
గోరంత అందానికి

నఖ సౌందర్యం
 
దూదితో కొద్దిగా పాలిష్ రిమూవర్‌ని అద్దుకొని అప్పటికే గోర్లకు ఉన్న రంగును రుద్దుతూ తీసేయాలి. నెయిల్ పాలిష్ ఉన్నా లేకపోయినా ఇలాగే చేయాలి. దీని వల్ల కంటికి కనిపించని మలినాలు కూడా తొలగిపోతాయి.
 
 వేళ్ల చర్మం భరించగలిగేటంత నీటిని ఒక గిన్నెలోకి , చల్లని నీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. వేడినీటి గిన్నెలో 5-8 నిమిషాలు గోళ్లు మునిగేలా వేళ్లను ఉంచాలి. గోళ్లు మెత్తబడినట్టు మీకే తెలుస్తుంది. మెత్తటి పొడి టవల్‌తో నీళ్లు లేకుండా తుడవాలి.
 
 నెయిల్ కటర్‌తో మీడియమ్ లెంగ్త్‌లో గోర్లను కట్ చేసుకోవాలి. మెత్తబడిన గోరును సరైన షేప్‌లో కట్‌చేసుకోవడం చాలా సులువు.
 
 నెయిల్ ఫిల్లర్‌తో ఒక్కో గోరు చివర భాగంలో రబ్ చేయాలి.  
 
 క్యుటికల్ ఆయిల్‌ను గోరుచుట్టూ రాయాలి. ఇందుకోసం ఆలివ్ లేదా జొజొబా నూనెను వాడచ్చు. ఒక్కో వేలికి ఒక్కో డ్రాప్ ఆయిల్ తీసుకొని, క్లాక్‌వైజ్‌గా తరువాత యాంటీ క్లాక్‌వైజ్ డెరైక్షన్‌లో వేలితో మసాజ్ చేయాలి.
 
 గోరుచుట్టూ ఉన్న మృత చర్మకణాలు ( క్యుటికల్స్) క్యుటికల్ పుషర్‌తో తొలగించాలి. (నెయిల్ కిట్‌లోనూ లేదా షాపులో విడిగానూ క్యుటికల్ పుషర్స్ లభిస్తాయి) ఆరోగ్యకరమైన గోర్లకు క్యుటికల్స్ చాలా ముఖ్యమైనవి. ఈ ప్లేస్‌లోనే బాక్టీరియా, ఫంగస్ చేరే అవకాశాలు ఉంటాయి. అందుకే చర్మానికి హాని కలగకుండా క్యుటికల్స్‌ను అత్యంత జాగ్రత్తగా శుభ్రపరచాలి. (ఇందుకోసం మరో 10 నిమిషాల సమయం పడుతుంది)
 
 హ్యాండ్ లోషన్‌ని వేళ్లకు, చేతులకు మాత్రమే ఉపయోగించాలి. పారపాటున గోర్ల మీద నూనె, మాయిశ్చరైజర్ ఉంటే తుడిచేయాలి.
 
 క్లియర్ బేస్ కోట్‌ని ప్రతి గోరుకు వేయాలి.
 

మరిన్ని వార్తలు