గ్రేట్‌ రైటర్‌.. స్టెండాల్‌

17 Sep, 2018 00:40 IST|Sakshi

ఏమాత్రం ఊహాశక్తి లేని నాన్నంటే తీవ్ర అసంతృప్తి. ఏడేళ్లప్పుడే చనిపోయిన తల్లి గురించిన తీరని శోకం. రష్యాపై నెపోలియన్‌ చేసిన దాడిలో దగ్ధమవుతున్న మాస్కోను సైన్యపు మనిషిగా చూసిన చారిత్రక అనుభవం. సంగీతం పైనా, స్త్రీలన్నా విపరీతమైన కాంక్ష. ఇదీ క్లుప్తంగా స్టెండాల్‌ నేపథ్యం. ఎన్నో కలంపేర్లు ఉపయోగించిన తర్వాత, చివరకు తనకు నచ్చిన చరిత్రకారుడు పుట్టిన జర్మనీ నగరం ‘స్టెండాల్‌’ పేరునే తన కలంపేరుగా స్వీకరించాడు మేరీ హెన్రీ బేల్‌ (1783–1842). జన్మతహః ఫ్రెంచీయుడు.  సాహిత్యంలో వచ్చిన ‘రియలిజం’ (వాస్తవికవాదం) ధోరణికి ఆద్యుడిగా స్టెండాల్‌ను కీర్తిస్తారు విమర్శకులు. పాత్రల లోలోపలి ఆలోచనలూ భావాలూ లోతుగా వ్యక్తం చేసిన కారణంగా  ‘మనస్తాత్విక నవల’ సృష్టికర్తగా కూడా చెబుతారు. ఆమోస్, ద రెడ్‌ అండ్‌ ద బ్లాక్, ద చార్టర్‌హౌజ్‌ ఆఫ్‌ పార్మా ఆయన నవలలు. మెమొయిర్స్‌ ఆఫ్‌ యాన్‌ ఈగోటిస్ట్‌ ఆత్మకథాత్మక రచన. ‘యుద్ధము శాంతి’ నవలలో టాల్‌స్టాయ్‌ చిత్రించిన వాస్తవిక యుద్ధఘట్టాలకు స్టెండాల్‌ ప్రేరణ.

మరిన్ని వార్తలు