బ్యూటిప్స్

8 Aug, 2016 23:34 IST|Sakshi
బ్యూటిప్స్

ఆయిలీ హెయిర్ పెట్టే ఇబ్బంది అంతా ఇంతా కాదు. ఊరికూరికే జిడ్డెక్కిపోతుంది. ఏ హెయిర్ స్టయిల్ వేసుకుందామన్నా ముద్దగా ఉండి ముప్పుతిప్పలు పెడుతుంది. అలాంటప్పుడు ఈ చిట్కాలు పాటిస్తే సమస్య తీరుతుంది.

 ఓ కప్పు నీటిలో పావుకప్పు నిమ్మరసం, మూడు చెంచాల తేనె వేసి కలపాలి. దీన్ని మాడుకు, జుత్తుకు పట్టించి బాగా మసాజ్ చేసి, తలకు బట్ట చుట్టేయాలి. గంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే మంచి ఫలితముంటుంది.

 ఓ కప్పు షాంపూ తీసుకుని... అందులో చెంచాడు కలబంద (అలొవెరా) జిగురు, చెంచాడు నిమ్మరసం కలపాలి. దీన్ని మాడుకి, జుత్తుకి పట్టించి... అరగంట తర్వాత శుభ్రంగా తలంటుకోవాలి. వారానికోసారి ఇలా చేస్తే... కొన్ని వారాలు తిరిగేసరికి జుత్తు జిడ్డెక్కడం ఆగిపోతుంది.

మరిన్ని వార్తలు