కరోడ్‌పతికి 20 ఏళ్లు

11 Jun, 2020 10:11 IST|Sakshi
హర్షవర్ధన్‌ నవాతే

హర్షవర్ధన్‌ నవాతే తొలి కె.బి.సి.లో (2000) కోటి రూపాయలు గెలుచుకున్నప్పుడు అతడి వయసు 27. ఆ డబ్బుతో ఒక ఏడాది పాటు రాక్‌ స్టార్‌లా వెలిగిపోయాడు. ధ్యాస పెట్టలేక సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌ని వదిలేశాడు. చేతిలో డబ్బుంది కాబట్టి యూకే వెళ్లి ఎంబీఏ చేసాడు. తొలి కారు మారుతీ ఎస్టీమ్‌ను కొనుక్కున్నాడు. ముంబైలో సొంత ఇంటివాడు కూడా అయ్యాడు. చాలా కాలం పాటు మహీంద్రాలో ఉద్యోగం చేశాడు. ఏడాదిగా ఓ కార్పొరేట్‌ కంపెనీకి హెడ్‌ గా ఉంటున్నాడు. కె.బి.సి. జ్ఞాపకాలను చెబుతూ, అమితాబ్‌ ఆ రోజు (తాను విజేత అయిన రోజు) తనతో అన్న మాటను గుర్తు చేసుకున్నాడు. ‘హర్షా.. డబ్బు వచ్చిందా, పోయిందా అని కాదు. ఏ స్థితిలోనూ నువ్వు నీ పేరెంట్స్‌ని నిర్లక్ష్యం చెయ్యకూడదు’ అని చెప్పారట అమితాబ్‌. ‘గ్రేట్‌ మ్యాన్‌. గ్రేట్‌ హ్యూమన్‌ బీయింగ్‌ అమితాబ్‌‘ అంటాడు హర్షవర్ధన్‌.

మరిన్ని వార్తలు