అతడు జూనియర్‌ వైఎస్‌ఆర్‌

8 Jul, 2017 01:46 IST|Sakshi
భార్య విజయలక్ష్మి, కుటుంబ సభ్యులతో జూనియర్‌ వైఎస్‌ఆర్‌

తెలుగు నేల నలుచెరగులా వై.ఎస్‌. అభిమానులు కోట్లాదిగా ఉన్నారు. వారిలో వీరాభిమానులు వేలాదిగా ఉంటారు. సూర్యాపేట పట్టణానికి చెందిన ఐనాల శ్రీనివాస్‌ అలాంటి వీరాభిమాని. ఎంత వీరాభిమాని అంటే వై.ఎస్‌లాగే ఆహార్యాన్ని ధరించి వై.ఎస్‌ గొప్పతనాన్ని ఆయన పధకాలని ప్రచారం చేస్తూ తిరుగుతూ ఉంటారు.వై.ఎస్‌ జయంతి, వర్థంతులను ఘనంగా జరుపుతూ పట్టణంలో జూనియర్‌ వై.ఎస్‌.ఆర్‌గా పేరు గడించారు.

అంతేకాదు ఆయన తన కుటుంబ సభ్యుల పేర్లను సైతం మార్చుకున్నాడు. భార్యకు విజయలక్ష్మి, కుమార్తెకు షర్మిల, కుమారుడికి జగన్‌గా నామకరణం చేశాడు. ‘వై.ఎస్‌.లా ప్రజలకు మేలు చేసిన నాయకుడెవరున్నారు? అందుకే ఆయనంటే నాకు పిచ్చి’ అని కదిలించనంతనే కళ్లు చెమ్మగిల్లించుకుంటాడు ఆ జూనియర్‌ వై.ఎస్‌.ఆర్‌.

మరిన్ని వార్తలు