అరటితో కలిగే లాభాల గురించి తెలుసా!

20 Jun, 2020 16:32 IST|Sakshi

సీజన్‌తో సంబంధం లేకుండా ఎల్లప్పుడూ లభించే పండు అరటి. ఈ పండ్లతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా. అరటి పండు తినడం వల్ల బరువు పెరుగుతారని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. కానీ బరువు తగ్గేందుకు ఇది చక్కటి ఔషధంగా పనిచేస్తోందని ఫిట్‌నెస్‌ నిపుణులు అంటున్నారు. కేవలం బరువు తగ్గడం మాత్రమే కాకుండా ఆరోగ్యానికి అరటి ఎంతో మేలు చేస్తుంది. రోజువారీ తీసుకునే ఆహరంలో కనీసం ఒక అరటిపండు చేర్చడం వల్ల ఎన్నో సత్ఫలితాలను ఇస్తుంది. అలాగే వీటి ధర కూడా సామాన్యుడికి అందుబాటులోనే ఉంటుంది. త్వరగా జీర్ణం అవుతుంది కాబట్టి ప్రతిరోజు వీటిని స్వీకరించవచ్చు. (బెల్లీ ఫ్యాట్ త‌గ్గ‌డానికి ఈ ఒక్క‌టి చేస్తే చాలు)


అరటితో ప్రయోజనాలు
ఉదయం అరటిపండును తింటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అరటిలో శరీరానికి సరిపడా కాల్షియం, ఐరన్ ఉంటుంది. ఇందులో ఉండే పొటాషియం బీపీని తగ్గించి గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. అరటి పండ్లలో విటమిన్ ఎ,బి,సి పుష్కలంగా ఉంటాయి. పరగడపున అరటి తీసుకోవడం వల్ల శక్తి వస్తుంది. తిన్న తక్షణమే శరీరానికి శక్తి అందుతుంది. కడుపులో పుండ్లకు అరటిపండు మంచి ఔషధం‌లా పనిచేస్తుంది. అరటి శక్తి సంపదగా పనిచేస్తుంది. జీర్ణాశయాన్ని మెరుగు పరిచేందుకు సహకరిస్తుంది. వ్యాధి నిరోధక శక్తి పెంపొందడంలో.. అల్సర్లను తగ్గించడంలో అరటి పండు కీలక పాత్ర పోషిస్తుంది. కండరాల బలహీనతను నివారించడంలో సహకరిస్తుంది. (కాకరతో 10 అద్భుత ప్రయోజనాలు..)

పండిన అరటి పండ్లలో పీచు పదార్థాలు అధికంగా ఉండటం వల్ల మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. డయేరియాతో బాధపడేవారు ఇవి తింటే మంచిది. అరటి పండు కండరాలు పట్టివేయడాన్ని, కీళ్ళ నొప్పిని నివారిస్తుంది. అరటిని అ‍ల్పాహారంగా తీసుకోవడం వల్ల ఆకలిని తగ్గిస్తుంది. దీనికి అరటిలో ఉంటే ఫైబర్‌ కారణం. కాబట్టి అతిగా ఆహారం తీసుకోవడం తగ్గించవచ్చు. వ్యాయాయం తర్వాత అరటి పండు తీసుకోవడం వల్ల వర్కౌట్ల సమయంలో కలిగే నొప్పిని తగ్గిస్తుంది. ది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిన్‌లో ప్రచురించబడిన అధ్యయనంలో ఇది తేలింది.అరటిపండు తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి తరచూ అనారోగ్యానికి గురికావడం తగ్గిస్తుంది. (పరగడుపున కరివేపాకు నమిలారంటే..)

అరటి పండ్లలో మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి కండరాలకు విశ్రాంతినిచ్చి చక్కటి నిద్రపట్టేలా చేస్తాయి. నిద్రిస్తున్నపుడు రక్తపోటుని అరటి పండు నియంత్రిస్తుంది. అరటిలోని పొటాషియం శరీరంలోని టాక్సిన్లను తొలగిస్తుంది. అరటి పండు తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. రాత్రిపూట పాలు, అరటిపండు తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది. వీటిని తినడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. క్యాన్సర్, ఉబ్బసం ప్రమాదాన్ని తగ్గించవచ్చు. (వారంలో ఏడు కిలోల బరువు తగ్గాలంటే..)

ఇక అరటితో ఆరోగ్యానికే కాకుండా అందానికి కూడా లాభాలు పుష్కలంగా ఉన్నాయి. అరటి వృద్ధాప్య ఛాయలను దరిచేరనీయదు. బాగా మగ్గిన అరటి పండును మెత్తగా చేసి కొద్దిగా తేనె కలిపి.. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. అరటి రక్తప్రసరణను మెరుగు పరుస్తుంది. మగ్గిన అరటి పండును నలిపి మాడుకు, జుట్టుకు పట్టించి ఇరవై నిమిషాల ఆగాక షాంపూ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టు ఆరోగ్యవంతంగా తయారవుతుంది. (కొబ్బరిబోండంతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా)

మరిన్ని వార్తలు