గాయాలు త్వరగా మాన్పే ఉలవలు

9 Apr, 2018 00:28 IST|Sakshi

ఉలవల్లో ప్రోటీన్లు, పిండిపదార్థాలు, ఫైబర్‌ వంటి పోషకాలు చాలా ఎక్కువ. ఉలవలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. వాటిలో కొన్ని...
ఉలవల్లో పీచు చాలా ఎక్కువ. ఫలితంగా అవి జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు మలబద్దకాన్ని, ఇతర జీర్ణకోశ సమస్యలను నివారిస్తాయి.
ఉలవల్లో ప్రోటీన్లు చాలా ఎక్కువ. కండరాల రిపేర్లకు ఇవి తోడ్పడతాయి. అందుకే  గాయాలు త్వరగా మానాలని భావించే వారు ఉలవలతో చేసిన పదార్థాలు తినడం ఎంతో మంచిది.
ఒబెసిటీని నివారించడానికి ఉలవలు మంచి ఆహారం.
ఇందులో క్యాల్షియమ్, ఫాస్ఫరస్‌ పాళ్లు చాలా ఎక్కువ. అందుకే ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు వాటిని దృఢంగా ఉంచుతాయి.
ఐరన్‌ పాళ్లు చాలా ఎక్కువ. అందుకే ఇవి రక్తహీనతను అరికడటాయి.

మరిన్ని వార్తలు