హెల్త్‌ టిప్స్‌

11 Apr, 2018 00:27 IST|Sakshi

బరువు తగ్గాలనుకునే వాళ్లు అనుకున్నదే తడవుగా ఆహారనియమాలు, వ్యాయామాలు మొదలు పెట్టడం జరుగుతుంటుంది. సాధారణంగా ఉండాల్సిన బరువుకంటే అదనంగా ఎన్ని కిలోలు ఉన్నారు? అంటే ఎంత బరువు తగ్గితే సరిపోతుంది, ఎంత సమయం తీసుకోవాలి అన్న విషయంలో స్పష్టత వచ్చాక నియమాలను పాటించడం మొదలుపెట్టాలి.

ఇందుకోసం అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.బరువు తగ్గాలనుకున్న వాళ్లు రోజువారీ ఆహారంలో కనీసం ఐదు సార్లు పచ్చి కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. వాటిలో శరీరానికి అవసరమైన విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్‌ సమృద్ధిగానూ కేలరీలు తక్కువగానూ ఉంటాయి.  

మరిన్ని వార్తలు