హెల్త్‌ టిప్స్‌

31 May, 2017 00:34 IST|Sakshi

రోజులో మూడుసార్లు హెవీగా తినడానికి బదులు రోజుకి ఐదారుసార్లు కొద్దికొద్దిగా తినడం మంచిది. ప్రతి భోజనానికి మధ్యలో రెండు మూడు గంటలు విరామం ఇవ్వాలి. దీని వల్ల  మెటబాలిజం వేగవంత మవు తుంది. తద్వారా ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతాయి.

ఆహారంలో 65 నుంచి 70 శాతం కార్బోహైడ్రేట్స్, 15 నుంచి 20 శాతం ప్రొటీన్స్, 10 నుంచి 15 శాతం ఫాట్స్‌ ఉండేలా చూసుకోవాలి. తినేటప్పుడు బాగా నములుతూ మెల్లిగా తినాలి. ఇలా చేయడం వల్ల దేహానికి తగినంత ఆహారం కడుపులో చేరగానే మెదడు నుంచి ఇక చాలనే సంకేతాలు జారీ అవుతాయి. ఆహారం పరిమాణం తగ్గుతుంది.

మరిన్ని వార్తలు