మేలు ఆకు తమలపాకు

26 Jul, 2017 23:46 IST|Sakshi
మేలు ఆకు తమలపాకు

హెల్త్‌ టిప్స్‌

తమలపాకుల్లో ఆరోగ్యాన్నిచ్చే సుగుణాలున్నాయి. ముఖ్యంగా పిల్లల ఆరోగ్యానికి తమలపాకులు చాలా ఉపయోగపడతాయి. వయసు పెరిగే కొద్దీ అరుగుదల క్షీణిస్తుందని బెంగ అక్కర్లేదు... రెండు తమలపాకులు నమలండి వాటిపని అవి చేసుకుంటూ పోతాయి. ఇంకా తమలపాకు వల్ల ఉపయోగాలేంటో చూడండి. తమలపాకులని ఆవనూనెలో నానపెట్టి కొద్దిగా వేడిచేసి పిల్లల చాతీపై రుద్దితే  ఆయాసం, దగ్గులాంటివి తగ్గుతాయి. ∙తమలపాకులను నూరి తీసిన రసాన్ని గాయాలపై రాస్తే గాయాలు త్వరగా మానిపోతాయి. ∙శుద్ధిచేసిన కొబ్బరినూనెలో తమలపాకుల నుంచి తీసిన రసాన్ని కలిపి వీపు వెనుక భాగంలో రాసినట్టయితే వెన్నునొప్పి తగ్గుతుంది.

తమలపాకు రసం గొంతు భాగంలో రుద్దితే గొంతులో నస, గొంతు మంట, గొంతు ఇన్‌ఫెక్షన్‌ నుంచి ఉపశమనం లభిస్తుంది. ∙కొన్ని చుక్కల తమలపాకుల రసాన్ని చెవిలో పిండితే చెవిపోటు తగ్గుతుంది. ∙భుక్తాయాసంగా ఉన్నప్పుడు తమలపాకులు నమిలితే అరుగుదల పెరిగి ఉపశమనం లభిస్తుంది. ∙మెత్తబడే వరకు తమలపాకుని వేడిచేసి దానిపై ఆముదం పూసి కాలిన గాయాలపై ఉంచితే, గాయం త్వరగా మానుతుంది. ఇలా గంటగంటకూ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ∙ఆర్థరైటిస్‌ వల్ల కీళ్లభాగంలో వచ్చే వాపుపై తమలపాకుని కాసేపు ఉంచితే  ఆ భాగంలో మంట, ఉపశమనం లభిస్తుంది.  
 

మరిన్ని వార్తలు