హెల్త్‌టిప్స్‌

30 Jul, 2017 23:05 IST|Sakshi
హెల్త్‌టిప్స్‌

రోజుకు ఒక గ్లాసు బనానా సూతీ తాగుతుంటే... శరీరం ఆరోగ్యంగాఉండడానికి, జుట్టు పెరుగుదలకు కావలసిన పోషకాలు అందుతాయి. జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. బనానా సూతీ చేయడం చాలా సులభం. పాలు, పెరుగు, తేనె, బాగా పండిన అరటిపండు గుజ్జు కలిపి మిక్సీలో బ్లెండ్‌ చేస్తే బనానా సూతీ రెడీ.

రోజుకొకసారి ఒక కప్పు తాజా పాలకూర రసం లేదా కొత్తిమీర రసం కాని తాగుతుంటే హెయిర్‌ఫాల్‌ కంట్రోల్‌ అవడమే కాకుండా జుట్టు త్వరగా పెరుగుతుంది కూడ. ఇలా మూడు నుంచి నాలుగు వారాలు చేస్తే ఫలితం కనిపిస్తుంది.

మరిన్ని వార్తలు