గొంతునొప్పి, మంట, దగ్గా..?

31 Oct, 2017 00:29 IST|Sakshi

హెల్త్‌ టిప్స్‌

టేబుల్‌ స్పూన్‌ తాజా నిమ్మరసం, అర స్పూన్‌ నల్ల మిరియాల పొడి, టీస్పూన్‌ ఉప్పులను ఒక గ్లాస్‌ వేడినీటిలో కలిపి మిశ్రమంగా తయారు చేయాలి. దీన్ని నోటిలో పోసుకుని పుక్కిలిస్తూ ఉంటే గొంతునొప్పి, మంట, దగ్గు తగ్గుతాయి.  తలనొప్పి నివారణకు యాస్ప్రిన్‌ వేసుకోవడం అందరూ చేసే పనే. అలా కాకుండా దాల్చిన చెక్కను నీటితో తడిపి అరగదీసి కణతలకు పూస్తూ ఉంటే తలనొప్పి ముఖ్యంగా జలుబు వల్ల వచ్చే తలనొప్పి సులువుగా తగ్గిపోతుంది.

అజీర్తి, పులితేన్పులు వస్తుంటే రెండు చిటికలు దాల్చిన చెక్కపొ రెండు చిటికలు శొంఠిపొడి, నాలుగు చిటికలు యాలకుల పొడీ కలిపి రోజూ భోజనానికి ముందు సేవిస్తూ ఉంటే  అజీర్ణం, తేపులు రాకుండా ఉంటాయి.

మరిన్ని వార్తలు