నిద్రలేమితో జుట్టుకు ముప్పు!

18 Dec, 2017 00:41 IST|Sakshi

మంచి నిద్ర ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. హార్మోన్ల సమతౌల్యతకు నిద్ర బాగా దోహదం చేస్తుంది. నిద్రలేమితో హార్మోన్ల సమతౌల్యత దెబ్బ తింటుంది. దాంతో సాధారణ ఆరోగ్యం దెబ్బతినడం, రోగనిరోధక శక్తి లోపించడంతో పాటు జుట్టుపై కూడా ఆ ప్రభావం పడుతుంది. నిజానికి నిద్రపోతున్న సమయంలో మన శరీరం తన ఒంట్లో అవసరమైన అన్ని రిపేర్లనూ చేపడుతుంది. అందులో అన్ని అవయవాలతో పాటు వెంట్రుకలు కూడా ఉంటాయి.

నిద్రలేమి కారణంగా ఆ రిపేర్ల కార్యక్రమం కుంటుపడటంతో మిగతా అన్ని అవయవాల్లాగే జుట్టు రిపేరు ప్రక్రియ  కూడా దెబ్బ తింటుంది. ఫలితంగా జుట్టు తన సహజ కాంతిని, మెరుపును కోల్పోవడం సాధారణం. అంతేకాదు జుట్టు బలహీనపడి రాలడం కూడా సహజమే. అందుకే ఒల్తైన తలకట్టుతో మెరుస్తున్న అందమైన జుట్టు కావాలనుకునేవారు పోషకాలతో కూడిన సమతుల ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో, తమ అలసట పూర్తిగా తీరిన అనుభూతి కలిగేంతగా కంటి నిండా నిద్రపోవడం అంతే అవసరం. కంటి నిండుగా నిద్రతోనే తల నిండుగా జుట్టు అని గుర్తుంచుకోండి.

మరిన్ని వార్తలు