కోడిగుడ్డు – మెంతికూర

10 Apr, 2017 23:51 IST|Sakshi
కోడిగుడ్డు – మెంతికూర

తయారి సమయం: 35 నిమిషాలు
కావలసినవి:
కోడిగుడ్లు – నాలుగు
(ఉడకబెట్టి, ఒక్కో దానిని రెండు భాగాలుగా కట్‌ చేసుకోవాలి)
ఉల్లిపాయలు – 2
అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ – టీ స్పూన్‌
పసుపు – పావు టీ స్పూన్‌
టొమాటో – 1, ఉప్పు – సరిపడా
మెంతి ఆకులు – అర కప్పు
జీలకర్ర పొడి – చిటికెడు
ధనియాల పొడి – 2 టీ స్పూన్లు
కారం – టీ స్పూన్‌
గరం మసాలా పొడి – చిటికెడు
నూనె – టేబుల్‌ స్పూన్‌

తయారి: ∙పాత్రలో నూనె వేడయిన తరవాత ఉల్లిపాయలు వేసి దోరగా వేయించి అల్లం–వెల్లుల్లి పేస్ట్‌ వేసి వేయించాలి.

టొమాటోలు వేసి అయిదు నిమిషాల పాటు వేయించి పసుపు వేసి కలపాలి. ∙మెంతి ఆకులు జతచేసి మరో అయిదు నిమిషాలు వేయించాలి. కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి కలపాలి. ∙అర కప్పు నీటిని జత చేసి కలియబెట్టి అయిదు నిమిషాలు వేగనివ్వాలి. ∙కట్‌ చేసిన కోడిగుడ్లు వేసి కలపాలి. మంట చిన్నది చేసి మరో ఏడు నిమిషాల పాటు వేగనివ్వాలి. lచివరగా మసాలా పొడి వేసి కలిపి దింపేయాలి. వేడివేడిగా అన్నంలోకి గాని చపాతీల్లోకి గాని వడ్డిస్తే రుచిగా ఉంటుంది.

మరిన్ని వార్తలు