బీట్‌రూట్‌ సలాడ్‌

9 Mar, 2017 23:11 IST|Sakshi
బీట్‌రూట్‌ సలాడ్‌

హెల్దీ కుకింగ్‌

కావలసినవి: బీట్‌రూట్‌ తురుము – ఒక కప్పు టొమాటో తరుగు – రెండు టీ స్పూనులు, కొత్తిమీర తరుగు – ఒక టీ స్పూను, నిమ్మరసం – అర టీ స్పూను ఉప్పు – తగినంత, పోపుకి: నూనె, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి... అన్నీ కొద్దికొద్దిగా.

తయారి: బీట్‌రూట్‌ తురుములో టొమాటో తరుగు, కొత్తిమీర తరుగు వేయాలి. తరవాత నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలపాలి. చివరగా వేయించుకున్న పోపు వేసి ఫ్రెష్‌గా తినాలి. ఎప్పటికప్పుడు చేసుకోలేని వాళ్లు రెండు మూడు రోజులకి సరిపడా తయారుచేసుకుని ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవచ్చు. (డయాబెటిక్‌ పేషెంట్లు దీనిని తినకూడదు)

మరిన్ని వార్తలు