చిక్కుడు కాయ పచ్చడి

20 Jan, 2017 00:21 IST|Sakshi
చిక్కుడు కాయ పచ్చడి

హెల్దీ కుకింగ్‌
కావలసినవి:
చిక్కుడుకాయలు – పావు కిలో; చింతపండు– కొద్దిగా;
ఎండు మిర్చి – 4; ఆవాలు – టీ స్పూను; జీలకర్ర – టీ స్పూను;
మెంతులు – అర టీ స్పూను; పసుపు – కొద్దిగా; ఇంగువ – చిటికెడు;
ఉప్పు – తగినంత; కొత్తిమీర – కొద్దిగా; నూనె – 2 టీ స్పూన్లు
తయారీ:
బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండు మిర్చి వరసగా వేసి, దోరగా వేగాక తీసి పక్కన ఉంచాలి
అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక చిక్కుడుకాయ ముక్కలు (చిక్కుడుకాయలను శుభ్రంగా కడిగి ఈనెలు తీసి, ముక్కలుగా చేయాలి) వేసి, కొద్దిగా వేగిన తర్వాత... ఉప్పు, చింతపండు, పసుపు, ఇంగువ వేసి బాగా కలిపి మూత పెట్టాలి
ముక్కలు బాగా మెత్తబడ్డాక బాణలి దించేయాలి
మిక్సీలో ముందుగా పోపు వేసి, మెత్తగా చేయాలి
చిక్కుడుకాయ ముక్కలు, కొత్తిమీర జతచేసి మరోమారు మిక్సీ పట్టి తీసేయాలి.

మరిన్ని వార్తలు