సాహో సగ్గుబియ్యమా...

21 May, 2019 00:18 IST|Sakshi

హెల్తీ ఫుడ్‌

సాగో అనే పేరుతో ప్రాచుర్యం పొందాయి సగ్గుబియ్యం. వీటిని కర్ర పెండలం నుంచి తీసుకున్న పొడితో తయారు చేస్తారు. సగ్గుబియ్యాన్ని పాయసంగా, ఉప్మాగా తయారు చేసుకుని తింటారు. జావగా కాచుకుని కూడా తాగుతారు. వీటిలో కార్బోహైడ్రేట్స్‌ ఎక్కువగా ఉంటాయి. ఫ్యాట్‌ తక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవాళ్లకు సగ్గుబియ్యం సరైన ఆహారం. ఇందులో పిండిపదార్థం శాతం ఎక్కువగా ఉంటుంది. రసాయనాలు లేని సహజమైన తీపి గుణం ఉండటం వల్ల చాలమంది సగ్గు బియ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సగ్గుబియ్యంలో అనేక ఆరోగ్య రహస్యాలు దాగున్నాయి.  కండరాల పెరుగుదలకి సగ్గుబియ్యం ఉపయోగపడతాయి. వీటిలో ప్రొటీన్లు, క్యాల్షియం ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంతో పాటు రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ స్థాయులను తగ్గిస్తాయి. వీటిలో ఎక్కువ మొత్తంలో పొటాషియం ఉండటం వల్ల రక్తప్రసరణ సజావుగా సాగుతుంది. ఫలితంగా గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలను తగ్గిస్తాయి.  

వీటిని ఆహారంలో చేర్చుకుంటే సత్తువ వస్తుంది. దాంతో రోజంతా ఉత్సాహంగా ఉంటారు. వీటిలోని కార్బొహైడ్రేట్స్‌ శరీరానికి కావాల్సిన మోతాదులో ఉంటాయి. గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను  నివారిస్తాయి. అలాగే శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ స్థాయులను పెంచి.. ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. వీటిలో ఫోలిక్‌ యాసిడ్, విటమిన్‌ బి ఉంటాయి కాబట్టి గర్భిణీలు వీటిని డైట్‌ లో చేర్చుకోవాలి. వీటిలో ఉండే విటమిన్‌ కె మెదడుకి మంచిది.  

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా