హెల్దీ ట్రీట్‌

27 Dec, 2016 23:57 IST|Sakshi
హెల్దీ ట్రీట్‌

పనీర్‌ మటర్‌ సబ్జీ...

కావలసినవి
పనీర్‌ తురుము – 1 కప్పుపచ్చిబఠాణీ – అర కప్పు, టొమాటో – 1 (సన్నగా తరగాలి)వెన్న తీసిన పాలు – అర కప్పు, నూనె – 1 టీ స్పూన్‌గరం మసాలా – పావు టీ స్పూన్, ధనియాల పొడి – చిటికెడుఉప్పు, మిరియాలపొడి – రుచికి తగినంత కొత్తిమీర – 1 టేబుల్‌స్పూన్‌ (సన్నగా తరగాలి)

తయారి
1. పాన్‌లో నూనె వేసి వేడిచేయాలి. టొమాటోలను, పచ్చిబఠాణీలను వేసి తక్కువ మంటపై మూడు – నాలుగు నిమిషాలు ఉడికించాలి. దీంట్లో ఉప్పు వేసి కలపాలి.

2. పనీర్‌ వేసి కలిపి మరో రెండు – మూడు నిమిషాలు ఉంచాలి.

3. మిరియాలపొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసి మాడకుండా జాగ్రత్తపడుతూ ఉడికించాలి.

4. దీంట్లో పాలు కలిపి ఎనిమిది నిమిషాలైనా ఉడకనివ్వాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్‌ చేసి వేడివేడిగా రోటీస్‌తో అందించాలి.

నోట్‌: దీంట్లో క్యారట్, బీన్స్, ఉల్లిపాయలు... ఇలా ఏ కూరగాయ ముక్కలనైనా వేసుకోవచ్చు.

పోషకాలు:
క్యాలరీలు – 185
కార్బోహైడ్రేట్స్‌ – 12గ్రా.
ప్రొటీన్లు – 14 గ్రా.
ఫ్యాట్‌ – 10 గ్రా.

మరిన్ని వార్తలు