మిత్రులు చేసిన సహాయం

7 Mar, 2015 23:23 IST|Sakshi
మిత్రులు చేసిన సహాయం

నల్లవులై అడవుల్లో ఒక పావురం ఉండేది. దానికి కొంచెం బిడియం ఎక్కువ. ఎవరితోనూ మాట్లాడేది కాదు. అందుకే దానికి స్నేహితులెవరూ లేరు. అది పెళ్ళి చేసుకోవాలనుకుంది. ఒక అందమైన ఆడ పావురం దగ్గరకు వెళ్ళి ‘‘నన్ను పెళ్ళి చేసుకుంటావా?’’ అని అడిగింది,  ఆడ పావురం ‘‘నీకు స్నేహితులున్నారా?’’ అని అడిగింది. ‘‘లేరు’’ అని జవాబిచ్చింది వుగ పావురం.‘‘అరుుతే నీవు ఎవరితోనైనా స్నేహం చేస్తేనే నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను’’ అని అన్నది.

 వుగ పావురం ఒక తాబేలుతో, డేగతో, సింహంతో స్నేహం చేసింది. తరువాత ఆ విషయుం ఆడ పావురంతో చెప్పడంతో అది పెళ్ళికి ఒప్పుకుంది. ఆ రెండు పావురాలు పెళ్ళి చేసుకున్నారుు. ఒక చెట్టుపై గూడు కట్టారుు. ఆ గూట్లో గుడ్లు పెట్టింది ఆడ పావురం. కొన్నాళ్ళ తర్వాత గుడ్లనుండి చిన్న చిన్న పావురాల పిల్లలు బయుటకు వచ్చారుు.

ఒక రోజు కొంతవుంది వేటగాళ్ళు ఆ అడవికి వచ్చారు. రాత్రి పావురాలు ఉంటున్న చెట్టు కింద చలివుంట వేసుకున్నారు. ఆ వుంట వేడికి గూట్లో ఉన్న చిన్న పావురాలు తట్టుకోలేకపోయూరుు. అక్కడి నుండి ఎగిరిపోదావుంటే వాటికి ఇంకా రెక్కలు కూడా రాలేదు. ఆ వేడికి అవెక్కడ చచ్చిపోతాయోనని భయుపడింది పావురాల జంట.

వెంటనే వుగ పావురం వెళ్ళి తాబేలును సహాయుం అడిగింది. తాబేలు నీళ్ళతో వుంటను ఆర్పబోరుుంది. కానీ వేటగాళ్ళు తాబేలును పట్టబోయూరు. అందుకే అది నీళ్ళలోకి జారుకుంది. పావురం డేగ వద్దకు వెళ్ళి సహాయుం అడిగింది. డేగ వేగంగా ఎగురుకుంటూ వెళ్ళి సింహాన్ని పిలిచింది. సింహం అక్కడికి వచ్చింది. సింహాన్ని చూసి వేటగాళ్ళు భయుపడి పారిపోయూరు. తాబేలు బయుటికి వచ్చి నీళ్ళతో వుంటను ఆర్పింది. ఇలా అందరు మిత్రులు కలిసి పావురాల కుటుంబానికి సహాయుం చేసారు. వుగ పావురానికి ఆడ పావురం ‘‘నీకు మిత్రులుంటేనే టతపెళ్ళి చేసుకుంటాను’’ అని ఎందుకు అన్నదో అర్థవురుుంది.
 

మరిన్ని వార్తలు