రీతూ పవనాలు

25 Dec, 2015 00:11 IST|Sakshi
రీతూ పవనాలు

ఆమె పేరే చాలు అంటారు ఫ్యాషన్ ప్రియులు.
దేశీయ చేనేతలదే ఆ ఘనతంతా అంటారామె వినమ్రంగా.
మన చుట్టుపక్కలే ఉన్న హస్తకళానైపుణ్యంతో
విదేశీ సెలబ్రిటీలు సైతం తన ఫ్యాషన్‌కు
చుట్టాలు పక్కాలుగా మారిపోయేలా చేసిన ఆ రీతూ‘పవనాలు’
మీ ఇంటా వీయాలని కోరుకుంటున్నారా...
అయితే ఈ డిజైన్లు మీకోసమే...

 
బనారస్

 పట్టు చీర అనగానే పెళ్లిళ్లకు మాత్రమే అనుకుంటారు. కానీ, స్లీవ్‌లెస్ హాల్టర్ నెక్ బ్లౌజ్, బాటమ్‌గా షిమ్మర్ చుడీ ధరించి బెనారస్ పట్టు
 చీర కడితే సంప్రదాయ   పార్టీ ఏదైనా ఆకర్షణీయంగా మెరిసిపోవచ్చు. పాలనురగ లాంటి లెహంగా , చున్నీ నైట్ పార్టీలో ప్రధాన ఆకర్షణ. చేతికి వెడల్పాటి పట్టీ, చెవులకు పెద్దపెద్ద రింగులు ధరిస్తే వెస్ట్రన్‌పార్టీకీ బాగా నప్పుతుంది.వేడుకలలో వైభవంగా వెలిగిపోవాలంటే ఫ్యాబ్రిక్, ఎంబ్రాయిడరీ వర్క్ కలర్స్ బ్రైట్‌గా ఉండాలి.  బెనారస్, క్రేప్ ఫ్యాబ్రిక్‌పైన జరీ పువ్వులు, ఆకులు, లతలతో గ్రాండ్‌గా తీర్చిదిద్దిన లెహంగా ఇది. పూర్తి ఎంబ్రాయిడరీ వర్క్‌తో ఈ లెహంగాను తీర్చిదిద్దారు. ట్రెడిషనల్, వెస్ట్రన్ కలగలిపి డిజైన్ చేసిన టాప్, లెగ్గింగి కాంబినేషన్ ఇది.  
 

మరిన్ని వార్తలు