ఎండాకాలమ్‌... ఎంజాయ్‌ చేద్దామ్‌...

6 Apr, 2017 00:33 IST|Sakshi
ఎండాకాలమ్‌... ఎంజాయ్‌ చేద్దామ్‌...

సమ్మర్‌ అనగానే భయపడేవారే గానీ ఇష్టపడేవారుంటారా? అంటే మేమున్నాంగా అంటున్నారీ స్టార్స్‌. సమ్మర్‌ సీజన్‌లో కొద్దిపాటి జీవనశైలి మార్పులు చేసుకుంటే చాలు... వేడి కాలానికి హాయిగా వీడ్కోలు చెప్పేయవచ్చు అంటున్నారు. ఎండా కాలాన్ని ఆరోగ్యకరంగా ఆనందించేందుకు ఉపకరించే తమ  లైఫ్‌స్టైల్‌ ఛేంజెస్‌ను ఇలా వివరిస్తున్నారు.

తలకు క్యాప్‌... గోవా ట్రిప్‌http://img.sakshi.net/images/cms/2017-04/41491418770_Unknown.jpg
వేసవి సీజన్‌ని నేను బాగా ఎంజాయ్‌ చేస్తా. నా యాన్యువల్‌ బీచ్‌ హాలిడేస్‌ టైమ్‌ అదే. ఈ టైమ్‌లో గోవా నేను ఎంచుకునే అత్యంత ప్రధానమైన డెస్టినేషన్‌. సన్‌బ్లాక్, సమ్మర్‌లో ఫెడొరా/బ్యాండేనా (తలకు పెట్టుకునే క్యాప్‌/ బ్యాండ్‌) లేకుండా బయటకు అడుగుపెట్టను. డీ హైడ్రేషన్‌ రాకుండా గ్రీన్‌ జ్యూసెస్, మంచి నీళ్లు అధికంగా తీసుకుంటాను. సిట్రస్‌ ఫ్రూట్స్‌ తీసుకోను. కొబ్బరినీళ్లు, పుచ్చకాయ, దానిమ్మ... బాగా తీసుకుంటాను. – బిపాసా బసు

రోజ్‌ వాటర్‌స్ప్రే.. బ్రౌన్‌రైస్‌
http://img.sakshi.net/images/cms/2017-04/71491418575_Unknown.jpgఈ సీజన్‌లో లూజ్‌ ట్రెండీ క్లోత్స్‌ హ్యాపీగా ధరించవచ్చు. సమ్మర్‌లో ఫ్యాషన్‌ అంటే లూజ్‌ క్లోత్స్, లినెన్, కాటన్‌ వంటి సౌకర్యవంతమైన ఫ్యాబ్రిక్స్, షార్ట్‌ డ్రెస్సులు, ఫ్లోయీ స్కర్ట్స్, ఎక్కువ వైట్‌ కలర్‌వి వార్డ్‌రోబ్‌ నుంచి బయటకు తీస్తాను. నుదుటి మీద హెయిర్‌ పడితే చాలా చికాకుగా ఉంటుందీ సీజన్‌లో. అందుకని బొహెమెయిన్‌ హెయిర్‌ బ్యాండ్‌/ హెడ్‌ గేర్‌ ధరిస్తాను. స్పైసీ, ఆయిలీ ఫుడ్‌ని పూర్తిగా దూరం పెడతాను. శరీరాన్ని చల్లగా ఉంచేందుకు రోటీస్, బ్రౌన్‌ రైస్‌ వాడతాను. కొబ్బరి నీళ్లు, పెరుగు, మజ్జిగ, కోల్డ్‌ వాటర్‌ మిలన్‌ సలాడ్‌ వంటివి తీసుకుంటాను. తరచుగా ముఖాన్ని శుభ్రమైన నీళ్లతో కడుగుతాను. అలోవెరా మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్‌ లోషన్‌ ఉపయోగిస్తాను. రోజ్‌వాటర్‌ స్ప్రే చేసుకుంటే ఓహ్‌... ఎంత రిఫ్రెషింగ్‌! నా బ్యాగ్‌లో స్కిన్‌వైప్స్‌ (చర్మాన్ని శుభ్రపరచుకునేవి) తప్పకుండా ఉంటాయి.
– రియా చక్రవర్తి

 

నాన్‌ స్పైసీ ఫుడ్‌... కాటన్‌ డ్రెస్‌
http://img.sakshi.net/images/cms/2017-04/41491418665_Unknown.jpg
వింటే మరీ విపరీతంగా అనిపిస్తోందేమో కానీ నేను వేసవి కాలాన్ని బాగా ఆస్వాదిస్తాను. అవుట్‌ డోర్‌ షూటింగ్‌ ఉంటే మన మేకప్‌ సామాన్లు సర్దుకోవడం, విభిన్న రకాల దుస్తులు ధరించడం వగైరా చికాకులు ఉంటాయి. అదేమీ లేకపోతే మాత్రం సమస్య లేదు. మామూలుగానే నేను కాటన్‌ దుస్తులు ధరిస్తా కాబట్టి... ఈ సీజన్‌ కోసం ప్రత్యేకంగా డ్రెస్సింగ్‌ మార్చనక్కర్లేదు. అలాగే ఎప్పుడూ తక్కువ ఆయిల్, నాన్‌ స్పైసీ డైట్‌ మాత్రమే తీసుకుంటాను. సో... డైట్‌ కూడా మార్చే అవసరం లేదు. అయితే ఎప్పటికన్నా ఎక్కువగా సీజనల్‌ ఫ్రూట్స్‌ తీసుకుంటాను. అలాగే మంచినీరు క్వాంటిటీ పెంచుతాను. – కత్రినాకైఫ్‌

సలాడ్‌... హోమ్‌ ఫుడ్‌http://img.sakshi.net/images/cms/2017-04/61491418887_Unknown.jpg
ఎస్‌! హాట్‌ హాట్‌ సమ్మర్‌ని ఎంజాయ్‌ చేయాలంటే కూల్‌ కూల్‌ మార్పులు చేసుకుంటే సరి. నేనైతే ఈ సీజన్‌లో లేవగానే బొప్పాయి పండును నిమ్మరసం పిండుకుని తింటాను. దాంతోపాటే ఒక గ్లాసుడు గోరువెచ్చని నీళ్లు తాగుతాను. ఇంట్లో వండిన ఫుడ్‌ మాత్రమే తీసుకుంటాను. ఆహారంలో చిరుధాన్యాలు, కూరగాయల వాడకం పెంచుతాను.  మామూలుగా అయితే రోజూ వర్కవుట్‌ చేస్తా. కాని ఈ సీజన్‌లో పిలాటిస్, డ్యాన్స్‌ ప్రిఫర్‌ చేస్తాను. ఎప్పుడూ వాటర్‌ సిప్పర్‌ నాతోనే ఉంటుంది. ఈ సీజన్‌లో ఎక్కువగా తేలికపాటి దుస్తులు లేదా వైట్‌ షర్ట్, జీన్స్‌నే ధరిస్తాను. – జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌

మరిన్ని వార్తలు