టీ తాగడంలో ఘనాపా‘టీ’లు

27 Jan, 2016 23:18 IST|Sakshi
టీ తాగడంలో ఘనాపా‘టీ’లు

భారతీయుల జాతీయ పానీయం టీ కావచ్చు గానీ టీ తాగడంలో మనోళ్లను మించిన ఘనాపాటీలు ఐరిష్ ప్రజలు. ప్రపంచవ్యాప్తంగా టీ అత్యధిక తలసరి వినియోగం జరిగేది ఐర్లాండ్‌లోనే. ఐరిష్ ప్రజలు సగటున రోజుకు 3.2 కప్పులు... అంటే... ఏటా 1184 కప్పుల టీ చప్పరించేసేస్తారట.

ఈ లెక్కలు అధికారికంగా తేలడంతో గిన్నెస్ బుక్ సైతం ఐరిష్ ప్రజల ఘనతను గుర్తించి టీ తాగడంలో వారే ఘనాపాటీలని రికార్డు నమోదు చేసుకుంది.
 
 

 

మరిన్ని వార్తలు