పొడుగరులే ఆరోగ్యవంతులట!

13 May, 2015 01:07 IST|Sakshi
పొడుగరులే ఆరోగ్యవంతులట!

రోజువారీ పనుల్లో పొడుగరులకు తరచు కొన్ని ఇబ్బం దులు తప్పకపోయినా, ఆరోగ్యం విషయంలో మాత్రం పొడగరులే అదృష్టవంతులని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. పొట్టి వారితో పోలిస్తే పొడగరులకు గుండెజబ్బులు, వినికిడి సమస్యలు తలెత్తే అవకాశాలు చాలా తక్కువ అని అమెరికాలోని ఓహయో స్టేట్ వర్సి టీ పరిశోధకులు చెబుతున్నారు. ఈ పరిశోధకులు చేప ట్టిన అధ్యయనంలో పొడగరుల గురించి మరిన్ని ఆసక్తి కరమైన విశేషాలు వెలుగులోకి వచ్చాయి.

పొట్టి వారి కంటే పొడగరులే కెరీర్‌లో బాగా రాణించడమే కాకుం డా, ఎక్కువ సంతోషంగా కూడా ఉంటారని పరిశోధ కులు చెబుతున్నారు. అయితే వీరికి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్లు లేకపోలేదు. వీరికి స్కిన్ కేన్సర్, కోలన్ కేన్సర్, కిడ్నీ కేన్సర్ వంటి కొన్ని రకాల కేన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువని అంటున్నారు.

మరిన్ని వార్తలు