హెచ్‌ఐవీ, హెపటైటిస్‌లు హోమియోతో హద్దుల్లో...

30 Dec, 2013 23:50 IST|Sakshi

రక్తమార్పిడి. ఇంజక్షన్‌లు, సంభోగం, ముద్దుల ద్వారా లైంగిక వ్యాధులు వ్యాపిస్తాయి. ఒక్కోసారి ఇవి ప్రాణాంతకమూ కావచ్చు. హెర్పిస్, గనేరియా, సిఫిలిస్, హెచ్‌పీవీ లాంటి వ్యాధులను ముందే గుర్తించి హోమియో చికిత్స తీసుకుంటే పూర్తిగా నయమవుతాయనీ, హెచ్‌ఐవి లాంటివి నియంత్రణలో ఉండి, రోగనిరోధకశక్తి పెరుగుతుందని అంటున్నారు ప్రముఖ హోమియో వైద్యనిపుణులు డాక్టర్ రవికిరణ్.
 
 ఎయిడ్స్ లేదా హెచ్‌ఐవి: హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్ వ్యాధి నిరోధకశక్తిని నాశనం చేసి, టీబీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, నిమోనియా, విరేచనాలు, చర్మరోగాలకు తేలిగ్గా గురయ్యేలా చేస్తుంది.
 
 లక్షణాలు: అరక్షిత సంభోగం అనంతరం రెండు నుంచి నాలుగు వారాల తర్వాత జ్వరం, గొంతునొప్పి, కురుపులు, ఒళ్ళు నొప్పులు, నీరసం, నోటిపూత, తలనొప్పి, వికారం, వాంతులు, బరువు తగ్గడం, నోటిలో అల్సర్లు, రాత్రిపూట చెమటలు, కీళ్ళ నొప్పులు, గవద బిళ్ళల వాపు, కాలేయం, ప్లీహం వాపు.
 
 హెచ్‌ఐవీని గుర్తుపట్టేదెలా?

 ప్రాథమికంగా ట్రైడాట్ టెస్ట్; ఎలీసా; కచ్చితత్వానికి వెస్ట్రన్‌బ్లాట్ టెక్నిక్.
 హోమియో చికిత్స... హెచ్‌ఐవీ వ్యాధి బాధపడేవారిలో ముఖ్యమైన సమస్య రోగనిరోధకశక్తి తగ్గడం. రోగనిరోధకశక్తిని తగ్గకుండా ఆపగలిగితే రోగికి హెచ్‌ఐవీ కాంప్లికేషన్స్ రాకుండా మరికొంత సమయం ఆపవచ్చు. రోగికి హోమియో వైద్యం ద్వారా ఆరోగ్యవంతమైన జీవనాన్ని అందించవచ్చు.
 
 హెపటైటిస్ బి, సి వ్యాధులు :

 కొన్ని వైరస్‌లు శరీరంలో ప్రవేశించి నిద్రాణంగా ఉండిపోతాయి. ఆ సమయంలో ఎలాంటి లక్షణాలూ కనిపించవు. లక్షణాలేమీ లేవు కదా అని నిర్లక్ష్యంగా ఉండిపోతే ఒక్కోసారి ప్రాణాపాయం ఏర్పడవచ్చు. అలాంటి వాటిలో ముఖ్యమైనవి హెపటైటిస్ బి, సి, హెర్పిస్ సింప్లెక్స్ వైరస్‌లు.
 
 హెపటైటిస్ బి, సి కూడా లైంగిక కారణాల వల్ల సంక్రమిస్తాయి. ఇందుకు హెపటైటిస్ బి, సి వైరస్‌లే కారణం. ఈ వైరస్ తన ప్రత్యుత్పత్తికి కాలేయాన్ని ఎంచుకోవడంతో కాలేయానికి సంబంధించిన సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి.
 
 లక్షణాలు: అలసట, ఆకలి లేకపోవటం, వాంతులు, ఒళ్ళు నొప్పులు, జ్వరం ఉంటుంది. జ్వరం ఉన్నా బయటకు కనిపించదు. కళ్లు, శరీరం పచ్చగా మారటం, చర్మం మీద పొక్కులు, కీళ్లనొప్పులు, వాంతి వచ్చినట్టుగా అనిపించడం (వికారం), మూత్రం పచ్చగా రావడం; తరువాత నెమ్మదిగా కామెర్లు మొదలవుతాయి. చర్మంపై దద్దుర్లు కనిపిస్తాయి. చివరన కాలేయం పనితీరు తగ్గి మరణం సంభవిస్తుంది.
 హెచ్‌బీఎస్ ఏజీ అనే పరీక్ష ద్వారా హెపటైటిస్ బి వ్యాధిని గుర్తించవచ్చు. పీసీఆర్, డీఎన్‌ఏ క్వాలిటేటివ్ టెస్ట్ ద్వారా ఈ వ్యాధిని నిర్ధారించవచ్చు.
 
 హోమియో చికిత్స: హెపటైటిస్ బి, సి వైరస్‌లు కాలేయంలో పెరుగుతాయి. హోమియోలో క్లాసికల్ విధానం ద్వారానే ఈ వ్యాధిని ఎదుర్కోగలం. లైకోపోడియం, హెపర్ సల్ఫ్, మెర్క్‌సాల్, బ్రయోనియా, ఫాస్ఫరస్ వంటి  మందులు వ్యాధిని తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి.
 
 హెర్పిస్ సింప్లెక్స్: ఒక గుండుసూది గుండు మీద కోటి వైరస్‌ల దాకా ఇమిడిపోయేంత సూక్ష్మమైన ఈ వైరస్ జీవితాంతం బాధిస్తుంది.
 
 హెర్పిస్ సింప్లెక్స్-2:  ఈ వ్యాధి కూడా లైంగిక చర్యలతోనే వ్యాపిస్తుంది. తొలిదశలో జననాంగాల్లో మంట, నొప్పి, మూత్రంలో దురద, జ్వరం, ఒళ్ళు నొప్పులు, గజ్జలు, చంకల్లో గడ్డలు ఏర్పడటం దీని లక్షణాలు. వ్యాధి ముదిరాక జననాంగాలపై పొక్కులు ఏర్పడి, పగిలి పుండ్లలా మారతాయి.
 
 పరీక్షలు: హెచ్‌ఎస్‌వీ 1, 2 పరీక్షలు, ఐజీఏ, ఐజీఎం పరీక్షల ద్వారా.


 నిర్ధారణ: ఈ వ్యాధిలో వైరస్ నిర్ధారణ చాలా ముఖ్యం. లైంగిక సంపర్కం తరువాత వారం రోజులలో నీటి పొక్కులలాగా వచ్చి పుండ్లు కనిపిస్తాయి.
 
 హోమియో చికిత్స: హెర్పిస్ సింప్లెక్స్ వంటి లైంగిక వ్యాధుల నివారణకు హోమియో చికిత్స అద్భుతంగా పనిచేస్తుంది. ఈ చికిత్స మూలకారణాన్ని గుర్తించి దాన్ని తొలగిస్తుంది. దీనివల్ల సత్ఫలితాలు పొందవచ్చు.
 
 డాక్టర్ రవికిరణ్,
 గోల్డ్ మెడల్ ఫర్ ఎక్సలెన్సీ ఇన్ మెడిసిన్,
 ప్రముఖ హోమియో వైద్యనిపుణులు, మాస్టర్స్ హోమియోపతి,
 అమీర్‌పేట్, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్, హైదరాబాద్,
 కరీంనగర్,విజయవాడ,
 ఫోన్: 7842 108 108 / 7569 108 108

 

మరిన్ని వార్తలు