కచ్చీ దబేలీ

5 Mar, 2015 23:01 IST|Sakshi
కచ్చీ దబేలీ

హోలీ  స్పెషల్
 
కావలసినవి: ఎండు మిర్చి - 1; జీలకర్ర - అర టీ స్పూను; ధనియాలు - టీ స్పూను; దాల్చిన చెక్క - చిన్న ముక్క; లవంగాలు - 3
 వెల్లుల్లి చట్నీ కోసం... ఎండు మిర్చి - 2 (వేడినీళ్లల్లో సుమారు అరగంటసేపు నానబెట్టాలి); వెల్లుల్లి రేకలు - కప్పు (సన్నగా తరగాలి); నిమ్మ రసం - అర టేబుల్ స్పూను; ఉప్పు - తగినంత... ఫిల్లింగ్ కోసం... జీలకర్ర - టీ స్పూను ; ఉల్లి తరుగు - పావు కప్పు; ఇంగువ - చిటికెడు; చింతపండు + ఖర్జూరం చట్నీ - 2 టేబుల్ స్పూన్లు; బంగాళ దుంపలు - 3 (ఉడికించి తొక్క తీసి ముద్ద చేయాలి); దబేలీ మసాలా - 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు - తగినంత; కొబ్బరి తురుము - పావు కప్పు; కొత్తిమీర తరుగు - పావు కప్పు; దానిమ్మ గింజలు - పావు కప్పు; దబేలీ కోసం... పావ్ - 5 (మధ్యకు చేసి పెనం మీద బటర్‌తో కాల్చాలి); వేయించిన పల్లీలు - అర కప్పు; కొత్తిమీర తరుగు - అర కప్పు; సేవ్ - అర కప్పు; దానిమ్మ గింజలు - అర కప్పు; వెల్లుల్లి చట్నీ - తగినంత; చింతపండు + ఖర్జూరం చట్నీ - తగినంత....
 తయారీ: బాణలిలో నూనె లేకుండా ఎండు మిర్చి, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాలు వేయించి, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసి పక్కన ఉంచాలి నానబెట్టిన ఎండు మిర్చి, వెల్లుల్లి, నిమ్మ రసం, ఉప్పు గ్రైండర్‌లో వేసి మెత్తగా ముద్ద చేసి పక్కన ఉంచాలి.
(అవసరమైతే కొద్దిగా నీళ్లు కలపాలి)  బాణలిలో నూనె వేసి కాగాక జీలకర్ర వేసి వేయించిన తర్వాత, ఉల్లి తరుగు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి  ఇంగువ జత చేసి వేయించాక, చింతపండు + ఖర్జూరం చట్నీ వేసి బాగా కలపాలి ముద్దగా చేసి ఉంచుకున్న బంగాళదుంప ముద్ద వేసి మరోమారు కలిపి దబేలీ మసాలా పొడి, ఉప్పు వేసి కలియబె ట్టి, సుమారు మూడు నిమిషాలు ఉడికించాలి. (ఒకవేళ బాగా పొడిపొడిగా అనిపిస్తే రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు జత చేయాలి)  ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకుని, దాని మీద కొబ్బరి తురుము, ఆ పైన కొత్తిమీర తరుగు, ఆ పైన దానిమ్మ గింజలు వేసి పక్కన ఉంచాలి. (ద్రాక్ష పండ్లు కూడా వాడుకోవచ్చు)  పావ్ మీద ఒక వైపు స్వీట్ చట్నీ, మరో వైపు రెడ్ గార్లిక్ చట్నీ పూయాలి  పై భాగంలో బంగాళదుంప మిశ్రమం ఉంచి, ఆ పైన ఉల్లి తరుగు, కొత్తిమీర తరుగు వేయాలి.  ఆ పైన పల్లీలు, దానిమ్మ గింజలు వేసి, దబేలీ మసాలా కొద్దిగా చల్లాక, పైన సేవ్ వేయాలి  రెండవ పావ్ ఆ పైన ఉంచాలి అన్నిటినీ ఈ విధంగా తయారుచేసుకుని అందించాలి.

మరిన్ని వార్తలు