ఇంటిప్స్

6 Oct, 2016 22:42 IST|Sakshi
ఇంటిప్స్

అల్లం, వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్‌ని చేసిన తరువాత ఒక టీ స్పూన్ వేడి నూనె, ఉప్పు కలిపి నిల్వ చేయాలి. ఇలా చేయడం వల్ల ఎక్కువ కాలం నిల్వ ఉండడమే కాకుండా  వండిన పదార్థాలు రుచికరంగా ఉంటాయి. వండుతున్న అన్నంలో కనోలా ఆయిల్ ఒక టీ స్పూన్ వేసి వండితే అన్నం విడివిడిగా అవుతుంది. కొద్దిగా నిల్వ ఉన్న లడ్డూలను మైక్రో ఓవెన్‌లో అర నిమిషం పాటుంచితే తాజాగా అవుతాయి.
     
చపాతీలు వత్తుకునేటప్పుడు  బియ్యప్పిండిని పొడిపిండిగా వాడితే చపాతీలు మెత్తగా వస్తాయి.  ఉల్లిపాయలు, బంగాళదుంపలు ఒకేచోట నిల్వ చేయకూడదు. గది మూలల్లో కాస్తంత బోరిక్ పౌడర్ చల్లితే మూలల్లో దాగి ఉన్న బొద్దింకలు బయటికి వెళ్లిపోతాయి. నెమలిపింఛాన్ని గోడకి తగిలిస్తే బల్లులు బయటకు వెళ్లిపోతాయి.   ఒక గ్లాస్ నీటిలో కర్పూరం వేయాలి. ఈ గ్లాస్‌ని మీరు పడుకునే బెడ్ దగ్గర పెడితే దోమలు దరి చేరవు.
 
 

మరిన్ని వార్తలు