ఇంటిప్స్‌

14 Aug, 2018 00:20 IST|Sakshi

క్యారట్‌ పైభాగాన్ని కోసేసి గాలి దూరని కవర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో పెడితే ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి.క్యారట్‌ వండేటప్పుడు నాలుగైదు చుక్కల నిమ్మరసం కలిపితే రంగు ఆకర్షణీయంగా ఉంటుంది.అరటిపండ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే నల్లని కవర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచితే వారం రోజులైనా తాజాగా ఉంటాయి.  పచ్చిమిరపకాయలు తరిగిన తర్వాత వేళ్ళ మంట తగ్గాలంటే చల్లటి పాలలో కొద్దిగా చక్కెర వేసి అందులో వేళ్లను ముంచాలి.
 

మరిన్ని వార్తలు