ఇంటిప్స్‌

6 Sep, 2018 00:16 IST|Sakshi

బర్త్‌డే పార్టీల్లో కొవ్వొత్తులు వెలిగించిన తరవాత, అందరూ వచ్చి కేక్‌ కట్‌ చేసేలోపే కరిగిపోతుంటాయి. క్యాండిల్‌ ఎక్కువ సేపు వెలగాలంటే... ఒక రోజంతా కొవ్వొత్తులను ప్లాస్టిక్‌ కవర్‌లో పెట్టి ఫ్రీజర్‌లో ఉంచాలి. ఫ్రీజర్‌లో గట్టిపడిపోయిన క్యాండిల్‌ మెల్లగా కరుగుతూ ఎక్కువ సేపు వెలుగుతుంది. మైనం కరిగి కేక్‌ మీద పడుతుందేమోననే ఆందోళన ఉండదు. బాత్‌రూమ్‌లోని అద్దం నీటి ఆవిరితో మసకబారుతుంటుంది. అలా జరగకుండా ఉండాలంటే... వారానికోసారి అద్దాన్ని సబ్బు (డ్రై సోప్‌ బార్‌) తో రుద్ది ఆ తర్వాత పొడి వస్త్రంతో తుడవాలి.

పట్టుచీరలకు నూనె మరకలంటితే... మరక మీద మొక్క జొన్న పిండి (కార్న్‌ఫ్లోర్‌) చల్లి కొద్దిసేపు అలా ఉంచేయాలి. నూనెను పిండి పీల్చుకున్న తర్వాత పొడిరాలిపోయేటట్లు విదిలించాలి.  స్నానానికి వాడిన సబ్బు అరిగి చిన్నదైన తర్వాత దానిని వేడినీటిలో వేసి కొద్దిగా గ్లిజరిన్‌ కలిపి ఒక బాటిల్‌లో పోసి బాగా కదిలించాలి. ఈ లిక్విడ్‌ని హ్యాండ్‌వాష్‌గా వాడుకోవచ్చు. 

మరిన్ని వార్తలు